Future of Jobs : డిగ్రీ హోల్డర్స్ Vs స్కిల్ వర్కర్స్ ... ఎవరి సంపాదన ఎక్కువో తెలుసా..?

Published : Jan 23, 2026, 10:51 AM IST

Degree vs Skills : డిగ్రీలు చేసినవారు ఎక్కువ సంపాదిస్తున్నారా లేక పెద్దగా చదువు లేకున్నా మంచి స్కిల్స్ కలిగినవారు ఎక్కువ ఆదాయం కలిగివున్నారా..? భవిష్యత్ ఎలా ఉండబోతోందో తెలుసా? 

PREV
16
ఇక వీరికే బంగారు భవిష్యత్...

ఇండియాలో నిరుద్యోగం రోజురోజుకు మరింత పెరుగుతోంది.. దీనికి ప్రధాన కారణం మన విద్యావ్యవస్థ. చదివే చదువుకి చేసే ఉద్యోగాలకు అస్సలు సంబంధం ఉండదు... స్కిల్స్ లేకపోవడం వల్లే చాలామంది డిగ్రీలు, పీజిలు చేసి కూడా నిరుద్యోగులు మిగులుతున్నారు. కొన్ని రంగాల్లో మంచి శాలరీలున్నాయి... ఉద్యోగుల కొరత ఉంది... కానీ ఆ రంగాలవైపు చదువుకున్న యువత వెళ్లడంలేదు.

26
కాలేజీలు మూత పడతాయా..?

ఎవ్వరు చూసినా ఐటీ, మెడిసిన్... లేదంటే బ్యాంకింగ్, ఇతర ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించడమే. అందుకే పోటీ ఎక్కువగా ఉండి నిరుద్యోగిత పెరుగుతోంది. మన విద్యావ్యవస్థ కూడా డిమాండ్ ఉన్న పనులకు అవసరమైన స్కిల్స్ ను యువతకు నేర్పించడంలేదు... ఇంకా ట్రెడిషనల్ డిగ్రీలే కొనసాగుతున్నాయి. స్కిల్ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతున్నా మన ఉన్నత విద్యా వ్యవస్థలో మార్పులు రావడంలేదు... దీంతో సమీప భవిష్యత్ లో చాలా కాలేజీలు మూతపడే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

36
స్కిల్స్ ఉంటేనే జాబ్స్

కాలం మారింది... దీంతోపాటే ఉద్యోగాల తీరు మారింది. గతంలో డిగ్రీ చేతిలో ఉంటేచాలు జాబ్ వెతుక్కుంటూ వచ్చేది. ఇప్పుడలా కాదు... ఎన్ని డిగ్రీలున్నా స్కిల్ లేకుంటే నో జాబ్. అందుకే ఉద్యోగాలు చేసేవారికంటే ఎలక్ట్రీషన్స్, ప్లంబర్లు, డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, చిన్నచిన్న షాపుల్లో వ్యాపారాలు చేసువారు ఎక్కువ సంపాదిస్తున్నారు. బిఏ, బీకామ్, బిఎస్సి వంటి ట్రెడిషనల్ డిగ్రీలు చేసినవారే కాదు ఇంజనీరింగ్, ఎంబిఏ వంటి డిగ్రీలు చేసినవారు కూడా చాలిచాలని జీతంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

46
విద్యావ్యవస్థ మారాల్సిందే..

ఈ పరిస్థితి మారాలంటే మన విద్యావ్యవస్థ మారాలి.. ముఖ్యంగా ఉన్నత విద్య స్కిల్స్ నేర్పే విధంగా ఉండాలి. ప్రాక్టికల్ స్కిల్స్ లేకుండా 100శాతం పర్సంటేజ్ తో డిగ్రీ పట్టాలున్నా వేస్ట్... ఇవి జీవితాన్ని మెరుగుపర్చలేవు. కాబట్టి ఇంటిగ్రేటెడ్ వొకేషనల్ స్కిల్స్, ఎక్స్పరిమెంటల్ లెర్నింగ్, ఇండస్ట్రీ ఆధారిత డిగ్రీలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ డిగ్రీలు ఉన్నవారిది కాదు... మంచి స్కిల్స్ ఉన్నవారిది. కాబట్టి కాలేజీలు కూడా స్కిల్స్ పొంపొందించే డిగ్రీలను అందిస్తేనే భవిష్యత్ లో మనుగడ సాధించగలవు... లేదంటే మూత పడాల్సిందే.

56
ప్రస్తుతం స్కిల్ వర్కర్స్ సంపాదన...

ప్లంబర్ - నెలకు రూ.30,000-50,000

ఎలక్ట్రిషన్ - నెలకు రూ.35,000-60,000

టైల్స్ వర్కర్ - నెలకు రూ.30,000-50,000

స్విగ్గి, జొమాటో డెలివరీ భాయ్స్ - రూ.25,000-35,000

అమెజాన్, ప్లిప్ కార్ట్ డెలివరీ భాయ్స్ - రూ.28,000-40,000

చిన్నచిన్న షాప్స్ లో వ్యాపారాలు చేసేవారు కూడా సోషల్ మీడియాలో ప్రచారం ద్వారా మంచి లాభాలు పొందుతున్నారు. వీరు నెలకు రూ.30,000 నుండి రూ.70,000 వరకు సంపాదిస్తున్నారు.

66
డిగ్రీలు చేసి ఉద్యోగాలు చేస్తున్నవారి సంపాదన..

బిఏ, బీకామ్, బిఎస్సి - నెలకు రూ.10,000-18,000 (ప్రెషర్స్ గా చేరే సమయంలో)

ఎంఎస్సి - నెలకు రూ.15,000-25,000

ఎంబిఏ (టైర్ 2-3 కాలేజీల్లో) - నెలకు రూ.18,000-30,000

ఇంజనీరింగ్ (నాన్ టెక్ బ్యాగ్రౌండ్) - నెలకు రూ.12,000-20,000

టెక్ ఇంజనీరింగ్ - నెలకు రూ.20,000-30,000

Read more Photos on
click me!

Recommended Stories