Top 10 AI Colleges : ఏఐ కోర్సులు అందించే టాప్ 10 భారతీయ విద్యాసంస్థలివే... హైదరాబాద్ లోనే అత్యధికం

Published : Jan 27, 2026, 01:57 PM IST

Top 10 AI Colleges in India : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీకి  హైదరాబాద్ అడ్డాగా మారుతోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. AI కోర్సులు అందించే టాప్ ఇండియన్ కాలేజీల్లో అత్యధికం ఈ నగరంలోనే ఉన్నాయి. 

PREV
111
AI లో హైదరాబాదే తోపు...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది భవిష్యత్ టెక్నాలజీ కాదు...ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసిన టెక్నాలజీ. ఆరోగ్యం, బ్యాంకింగ్, మార్కెటింగ్ వంటి అనేక రంగాల్లో AI ని విరివిగా వాడేస్తున్నారు... ఇప్పటికే చాలా వ్యవస్థలను పూర్తిగా మార్చేస్తోంది. ఇలా ఆధునిక టెక్నాలజీలో ఏఐ మరో విప్లవానికి నాంది పలికింది. ప్రస్తుతం AI నిపుణులకు డిమాండ్ బాగా పెరిగింది.. సమీప భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశాలున్నాయి.

ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో దీన్నే కెరీర్ గా ఎందుకు ఎంచుకోకూడదు... ఇదే ఆలోచన చాలామంది యువతకు ఉంది. ఈ క్రమంలో భారతదేశంలో అద్భుతమైన AI ప్రోగ్రామ్‌లు అందిస్తున్న తొమ్మిది అగ్రశ్రేణి సంస్థల గురించి తెలుసుకుందాం.

211
1. ఐఐటీ హైదరాబాద్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కోర్సులు అనగానే ముందుగానే గుర్తుకువచ్చేది హైదరాబాద్ ఐఐటీ. ఎందుకంటే ఏఐలో ప్రత్యేకంగా బీటెక్ ప్రోగ్రామ్‌ను అందించిన మొదటి విద్యాసంస్థ ఇదే. హైదరాబాద్ ఐఐటీ మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్‌పై దృష్టి పెట్టింది. AI డెవలప్ మెంట్, దీన్ని ఏయే రంగాల్లో ఉపయోగించవచ్చు అనే అంశాలపై ఐఐటీ హైదరాబాద్ అనేక సెమినార్లు నిర్వహిస్తోంది.

311
2. ఐఐఐటీ హైదరాబాద్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశోధనలో ఐఐఐటీ హైదరాబాద్ ఒక మార్గదర్శి. ఇది మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, అప్లైడ్ AIపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇది టెక్ దిగ్గజాలతో కలిసి పనిచేస్తుంది.

411
3. ఐఐటీ మద్రాస్

భారతదేశంలోని టాప్ ర్యాంక్ సంస్థల్లో ఐఐటీ మద్రాస్ ఒకటి. ఇది AI, డేటా సైన్స్‌లో బీటెక్, ఎంటెక్, ఆన్‌లైన్ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. పరిశ్రమకు అనుగుణమైన పాఠ్యప్రణాళిక అందించడం దీని ప్రత్యేకత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రత్యేక దృష్టిపెట్టింది.

511
4. ఐఐఎస్సీ బెంగళూరు

AI, రోబోటిక్స్, డేటా సైన్స్‌లలో పోస్ట్ గ్రాడ్యుయేట్, పరిశోధన ప్రోగ్రామ్‌లను ఐఐఎస్సీ అందిస్తోంది. పరిశోధన, ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది గొప్ప ఎంపిక.

611
5. వీఐటీ - వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

తమిళనాడు వెల్లూరులోని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ ఈ వీఐటీ. ఇక్కడ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ AI ప్రోగ్రామ్‌లను అందిస్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రీ అనుభవం, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, ప్లేస్‌మెంట్ సహాయం బాగా ఉంటాయి.

711
6. అమిటీ యూనివర్సిటీ, నోయిడా

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పూర్తిస్థాయి బీటెక్‌ను అందించిన మొదటి ప్రైవేట్ కళాశాల అమిటీ. ఇక్కడ ఆధునిక ల్యాబ్‌లు, గ్లోబల్ భాగస్వామ్యాలు ఉన్నాయి.

811
7. బిట్స్ పిలానీ

బిట్స్, ఇండస్ట్రీ భాగస్వాములతో కలిసి కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లలో AI, డేటా సైన్స్ స్పెషలైజేషన్‌లను అందిస్తోంది. ఆన్‌లైన్ డిగ్రీలు కూడా అందుబాటులో ఉన్నాయి. బిట్స్ ప్రధాన క్యాంపస్ రాజస్థాన్ లో ఉంది... హైదరాబాద్ లో కూడా మరో క్యాంపస్ ఉంది.

911
8. ఐఐటీ బాంబే

డేటా సైన్స్, AIలో మంచి నైపుణ్యం ఉన్న ఐఐటీ బాంబే, థియరీని ఇండస్ట్రీ ప్రాజెక్టులతో కలిపి నేర్పించే ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. ఇది వాస్తవ ప్రపంచ అనువర్తనాలకు ఉపయోగపడుతుంది.

1011
9. ఐఐటీ ఢిల్లీ

ఐఐటీ ఢిల్లీ బీటెక్, ఎంటెక్, డిప్లొమా ప్రోగ్రామ్‌లలో AI, మెషిన్ లెర్నింగ్ కోర్సులను అందిస్తోంది. ఇక్కడి AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహిస్తుంది.

1111
10. ఐఐటీ ఖరగ్ పూర్

ఇండియాలోనే టాప్ ఐఐటీ లలో ఖరగ్ పూర్ ఒకటి. ఇక్కడ కూడా వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్పులు అందిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories