2026 ఫిబ్రవరిలో భారత జాబ్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకుంది. ముఖ్యంగా ఐటీ, ఏఐ రంగాల్లో నియామకాలు భారీగా పెరిగాయి. దీంతో నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చినట్టేనని నిపుణులు చెబుతున్నారు.
ఇక భవిష్యత్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే… ఇది నిజం. కానీ ఈ ఏఐ ఉద్యోగాలను మింగేస్తుంది అనే ప్రచారం మాత్రం నిజం కాదంటున్నారు నిపుణులు. ఇందుకు నిదర్శనమే గత నెలలో జరిగిన నియామకాలు.
కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న భారత వైట్ కాలర్ జాబ్ మార్కెట్ 2026 ఫిబ్రవరిలో భారీ వృద్ధిని చూసింది. ప్రముఖ జాబ్ పోర్టల్ 'Naukri Jobspeak' విడుదల చేసిన తాజా రిపోర్ట్స్ ప్రకారం… దేశంలోని ప్రధాన నగరాల్లో కంపెనీలు కొత్త నియామకాలపై ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో ఈ జోరు ఎక్కువగా కనిపిస్తోంది.
25
ఐటీ (IT) రంగంలో మళ్లీ పాత ఉత్సాహం..!
ఏఐ రాకతో ఐటీ రంగం కుదేలయ్యింది… పెద్దపెద్ద కార్పోరేట్ కంపెనీలు సైతం లేఆఫ్స్ చేపట్టాయి. ఇలా సంక్షోభంలో పడినట్లు కనిపించిన ఐటీ రంగం గతనెల ఫిబ్రవరిలో ఊహించని పురోగతి సాధించింది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఫిబ్రవరి నెలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు, క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది.
35
ఏఐతోనే కొత్త ఉద్యోగాలు..
ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తోంది. ఫిబ్రవరి రిపోర్ట్స్ ప్రకారం… ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ML) సంబంధించిన ఉద్యోగాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ChatGPT వంటి టెక్నాలజీలు వచ్చాక, కంపెనీలు తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఏఐ నిపుణుల కోసం వెతుకుతున్నాయి. ఇది యువతకు గొప్ప అవకాశంగా మారింది.
ఈ ఉద్యోగాల పెరుగుదలలో మెట్రో నగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 'భారత సిలికాన్ వ్యాలీ'గా పిలిచే బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతిస్థానం హైదరాబాద్ దే. ఇక పుణె, చెన్నై నగరాల్లో జాబ్ మార్కెట్ 10% నుంచి 15% వరకు వృద్ధిని నమోదు చేసింది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) రంగాల్లో నియామకాలు ఎక్కువగా జరిగాయి.
55
2026లో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంటుంది?
2026 సంవత్సరం ప్రారంభం జాబ్ మార్కెట్‌కు చాలా సానుకూలంగా ఉంది. కంపెనీలు ఇప్పుడు కేవలం డిగ్రీని మాత్రమే కాకుండా, 'స్కిల్-బేస్డ్' (నైపుణ్య ఆధారిత) నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాబట్టి, ఉద్యోగార్థులు కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటే అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.