మీ క్రిటికల్ థింకింగ్ కు టెస్ట్... ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి చూద్దాం..

Published : Mar 04, 2026, 05:23 PM IST

ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం అడగకండి. ఆన్సర్స్ ముఖ్యం కాదు. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలా ఆలోచిస్తే క్రిటికల్ థింకింగ్ అలవాటు అవుతుంది . ఇది పెద్దల క్విజ్. పిల్లలకు వారి వారి వయస్సు బట్టి ప్రశ్నలుంటాయి.

PREV
112
క్రిటికల్ థింకింగ్...

క్రిటికల్ థింకింగ్… తెలుగులో కుశాగ్ర బుద్ధి అని చెప్పుకోవచ్చు.

నేటి సమాజంలో బతకాలంటే ఇది అవసరం.

యంత్రాలకు బుర్రలొచ్చాయి.

పుంఖానుపుంఖాలుగా... వాట్సాప్, సోషల్ మీడియా రూపంలో సమాచారం వచ్చిపడుతోంది.

ఏది నిజమో, ఏది మోసమో తెలియాలంటే కుశాగ్ర బుద్ధి అవసరం.

కానీ... దీన్ని ఎలా పెంపొందించుకోవాలి..?

ఒక్క రోజులో రాదు.

ఏదో ఒకటి రెండు పుస్తకాలు చదివితే వచ్చేది కాదు.

నిరంతర సాధన ద్వారా వస్తుంది .

ఈ రోజు ఒక అడుగు వేయండి .

వార్త పత్రికల్లో వచ్చిన వార్తలు .. వాటి పై కుశాగ్ర బుద్ధి కోణంలో విశ్లేషణ ఇస్తున్నా.

ట్రై చేయండి .

212
1 . ఢిల్లీ లిక్కర్ కేసు ..

A. అసలు అవినీతి జరగలేదు. సీబీఐ కావాలనే తప్పుడు కేసు పెట్టింది.

B. తగిన సాక్షాలను సమర్పించడంలో సిబిఐ విఫలమయ్యింది.

C. కావాలనే సీబీఐ సాక్షాలను సమర్పించలేదు .

D. ఈ తీర్పు పైకోర్టులో నిలవదు.

312
2 . తెలంగాణాలో ఏ పార్టీ ఏ పార్టీ తో కుమ్మక్కయ్యింది ?

ప్రతి రోజు నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ తో కుమ్మక్కు అయ్యింది అని ఆరోపణలు చేసుకొంటున్న నేపథ్యంలో ఈ ప్రశ్న. దీనికి సమాధానం తెలిస్తే మీకు అరివీర భయంకర కుశాగ్ర బుద్ధి వాలా అని బిరుదు ఇవ్వాల్సిందే.

a. కాంగ్రెస్ బీజేపీ తో

b. బిఆర్ఎస్ కాంగ్రెస్ తో .

c. బిఆర్ఎస్ బీజేపీ తో

d. బీజేపీ మజ్లీస్ తో .

412
3. పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టులు..

a. కొత్త పార్టీ పెడుతారు.

b. కొత్త పార్టీ పెడుతారు కానీ దాని ప్రభావం అంత పెద్దగా ఉండదు.

c. పార్టీ పెట్టరు .

d. ఏదీ చెప్పలేము .

512
4. రాజకీయాల్లో ప్రవేశించిన తమిళనటుడు విజయ్ పై భార్య ఆరోపణలు ....

a. అతను భార్యకు ద్రోహం చేసాడు.

b. భార్యకు ద్రోహం చేసాడు. ఇప్పుడు ఈ విషయం కోర్ట్ కెక్కడం... ఆ వార్త ఇంత ప్రచారానికి నోచుకోవడం వెనుక స్టాలిన్ హస్తముంది .

c. భార్య చేసిన ఆరోపణలు అబద్దం .

d. పేను స్వామి మాత్రం ఈ కొచ్చిన్ కు ఆన్సర్ చెప్పగలడు .

612
5. పిల్లలపై ఆన్ లైన్ గేమ్స్ ప్రభావం...

5. రవి బ్యాంకు ఉద్యోగి. ఆయన భార్య శ్రీదేవి టీచర్. వీరి కుమారుడు ప్రభాకర్. రాజమండ్రికి చెందిన వీరు రియాద్ లో స్థిరపడ్డారు. 12 తరగతి చదువుతున్న ప్రభాకర్ ఆన్లైన్ గేమ్స్ కి బానిస. "వద్దు "అన్నందుకు తల్లితండ్రిని కత్తితో పొడిచి పొడిచి చంపి ఆపై ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తిని , మేడెక్కి దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ దుర్ఘటన నుంచి మనం గ్రహించాల్సింది ఏంటి..?

a. పిల్లల్ని మందలించకూడదు. ముఖ్యంగా సెల్ ఫోన్ వద్దు అనకూడదు.

b. పిల్లలకు గంటో రెండో గంటలో అయితే సెల్ ఫోన్ మంచిదే.

c. ప్రారంభంలో సరదాగా మొదలయ్యే సెల్ ఫోన్ సావాసం... వ్యసనం కింద మారి వ్యక్తిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది.

d. ఈ కాలం పిల్లలు సెల్ ఫోన్ తో కాకపోతే గోలీకాయలతో ఆడుకొంటారా..? ఎక్కడో ఏదో జరిగితే మనం పట్టించుకోకూడదు.

712
6. విద్యార్థులతో గంజాయి దందా..

6. విద్యార్థులే టార్గెట్ గా విజయవాడ, హైదరాబాద్ లాంటి నగరాల్లో బడుల చుట్టుపక్కలా గంజాయి.. బిస్కెట్ లు .. సిగరెట్ ల రూపం తో అమ్మి కొత్త విద్యార్థుల్ని రొంపిలోకి లాగుతున్న ముఠాలు...

a. మన బిడ్డ బంగారం. అలాంటి అలవాట్లు మన ఇంటావంటా లేవు.

b. ఇంట్లో బడిలో విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి. పాకెట్ మని పేరుతో ఇష్టారీతిన డబ్బులు ఇవ్వకూడదు.

c. పురాతన కాలంలోనే గంజాయి కొట్టేవారు. ఇప్పుడు కొడితే తప్పు కాదు.

గంజాయి దమ్ము బిగించి కొడితే .. ఆపై కార కిల్లి నమిలితే అనే పాట ఉన్న ఎన్టీఆర్ సినిమా అమితాబ్ సినిమాకు రీ మేక్ .

812
7. తెలంగాణ విద్య కమిషన్ సిఫారసుల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం....

a. ఇంటర్ విద్యను బడుల్లో కలిపేస్తుంది. దీని వల్ల ఇంటర్ లో కార్పొరేట్ సంస్థల అధిపత్యానికి గండిపడుతుంది.

b. ప్రభుత్వ టీచర్ల జీతాలు తగ్గించి వేస్తుంది. ఆ డబ్బు ద్వారా బడుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తుంది.

c. ఈ కమిషన్ సిఫారసుల కారణంగా విద్యా ప్రమాణాలు బాగా మెరుగుపడతాయి .

d. పై ఏదీ కాదు.

912
8 . ఈ రోజు నుంచి 14 ఏళ్ళ బాలికలకు ప్రభుత్వం ఉచితంగా సెర్వికల్ కాన్సర్ వాక్సిన్ వేస్తోంది.

a. ఈ వాక్సిన్ వేసుకొంటే సెర్వికల్ కాన్సర్ రాదు . ఎలాంటి కాన్సర్ రాదు. బిపి, డయాబెటిస్ లాంటి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. మనం పురాణాల్లో చదివిన సంజీవిని ఇదే.

b. ఇది వేసుకోకుంటే ఆరు నెలల్లో కాన్సర్ వచ్చేస్తుంది.

c. టీనేజ్ అమ్మాయిలంటే ప్రత్యేక ప్రేమ కలిగిన దయార్థ్ర హృదయుడు, దానకర్ణుడు, మానవతావాది బిల్ గేట్స్ ఇచ్చిన వరం ఇది. మనమందరూ ఆయనకు రుణపడి ఉండాలి. మనమే కాదు మన తరువాత తరాలు కూడా అయన విగ్రహం పెట్టుకొని కొలవాలి. అందరికీ చెప్పి వాక్సిన్ వేయించాలి. మొగమాటానికి పోయి ఒకటో రెండో కాదు.. కనీసం ఆరేడు వేయించాలి. అసలే ఉచితముగా వస్తుంటే ...

d. మన జనాభా తగ్గించాలని అలుపెరుగని పోరాటం చేస్తున్న గేట్ల తాత కు నోబుల్ పీస్ పీస్ ప్రయిజ్ ఇవ్వాలి. అదేదో వెంకటేష్ సినిమాలో తెలంగాణ శకుంతల వేణు మాధవ్ కు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వాలి.

1012
9. జపాన్ కోతి పిల్ల వీడియో వైరల్ అయ్యింది ..

a. మనుషుల్లో ప్రేమ కరుణ దయ దాక్షిణ్యం లాంటి మంచి గుణాలు బాగా విస్తరిస్తున్నాయి .

b. జంతువుల పట్ల ప్రేమ పొంగి పొరలుతోంది.

c. సోషల్ మీడియా హిపోక్రసీ.

d. కోతులు మన పూర్వీకులు.

1112
10. మొన్న జరిగిన పెళ్ళిలో వధువు ఆభరణాల బరువెంత..?

a. 1.5- 2 కిలోలు.

b. 3 కిలోలు

c. 5 కిలోలు .

d. ఎవరో పెళ్లి చేసుకొన్నారు. హాయిగా కాపురం చేయనీ. వారి సంపద గురించి, పెళ్లి వంటకాలు గురించి మనకెందుకు? మన బుర్ర చెత్తకుండీనా ?

1212
11. ఇక్కడిచ్చిన ప్రశ్నల సంఖ్య ...

a. 10

b. 8

c. చెప్పలేము . నేను లెక్కల్లో వీక్.

d. పై ఏదీ కాదు.

Read more Photos on
click me!

Recommended Stories