మీరు విదేశాల్లో ఫ్రీగా చదవొచ్చు... ఈ స్కాలర్ షిప్స్ కోసం ట్రై చేయండి

Published : Aug 26, 2025, 09:27 PM IST

విదేశాల్లో చదువుకోవాలన్నది చాలామంది విద్యార్ధుల కల. కానీ ఆర్థిక సమస్యల కారణంగా కొందరికి ఇది కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి విద్యార్థులు, నిపుణుల కోసం కొన్ని సంస్థలు స్కాలర్ షిప్స్ అందిస్తున్నాయి. వాటిగురించి తెలుసుకుందాం.

PREV
17
భారత విద్యార్థుల విదేశీ కలకు రెక్కలుతొడిగే స్కాలర్ షిప్స్...

కొన్ని స్కాలర్ షిప్స్ పొందడంద్వారా భారతీయ విద్యార్థులు విదేశీ విద్య కలను నిజం చేసుకోవచ్చు. చాలా మంది విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవట్లేదు. వివిధ దేశాలు అందించే స్కాలర్ షిప్స్ గురించి విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించే కొన్ని స్కాలర్ షిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

27
భారతీయ విద్యార్థులకు అందించే ముఖ్యమైన స్కాలర్‌షిప్పులు

1. ఫుల్‌బ్రైట్-నెహ్రూ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ (అమెరికా) :

భారత్ - అమెరికా మధ్య సాంస్కృతిక మార్పిడి, విద్యా సహకారాన్ని సులభతరం చేసే ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ కార్యక్రమమే ఈ ఫుల్ బ్రైట్-నెహ్రూ ఇంటర్నేషనల్ ఫెలోషిప్. దీన్ని భారత మొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ, యూఎస్ సెనెటర్ జె. విలియం ఫుల్ బ్రైట్ పేరుతో ఏర్పాటుచేశారు. ఈ స్కాలర్ షిప్ ద్వారా భారతీయ విద్యార్థులు, నిపుణులు యూఎస్ లో పరిశోధన, భోదన చేపట్టవచ్చు.. యూఎస్ నిపుణులు భారత్ లో పరిశోధన లేదా బోధన చేయవచ్చు. యునైటెడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (USIEF) ఈ ఫెలోషిప్ అందిస్తుంది. 2025లో 350 మందికి పైగా భారతీయ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ లభించింది.

37
2. చెవెనింగ్ ఫెలోషిప్ (బ్రిటన్)

యూకే ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక స్కాలర్ షిప్ ఈ చెవెనింగ్ ఫెలోషిప్. దీనికింద తక్కువకాలంలో పరిశోధనలు, కోర్సులు చేసేందుకు యూకే విద్యాలయాలు భారతీయ విద్యార్థులకు అవకాశం కల్పిస్తాయి. 1983 నుంచి ఇప్పటివరకు 3,700 మందికి పైగా భారతీయులకు ఈ స్కాలర్‌షిప్ లభించింది. 2023-24లో 44 మంది భారతీయులు దీన్ని పొందారు.

47
3. డిఏఏడి ఫెలోషిప్ (జర్మనీ)

డిఏఏడి (DAAD) అనేది ఒక జర్మన్ అకడమిక్ ఎక్స్చేంజ్ సర్వీస్. ఈ ఫెలోషిప్ ద్వారా విదేశాలకు చెందిన విద్యార్థులకు జర్మనీలో చదువుకోవడంతో పాటు పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. జర్మనీకి చెందిన పలు విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు విదేశీ విద్యార్థులకు అవకాశం ఇస్తున్నాయి.

57
4. ఎరాస్మస్+ (యూరోపియన్ యూనియన్):

యూరోపియన్ యూనియన్ దేశాల్లో చదువుకునే అవకాశం కల్పిస్తుంది ఈ ఎరాస్మస్ ప్లస్ ఫెలోషిప్. దీనిద్వారా విద్యార్థులు చదువుకోడానికి, ఇతర నిపుణులు బోధనా విభాగంలో పనిచేయడానికి, శిక్షణ పొందడానికి వీలుంటుంది.

67
5. ఆస్ట్రేలియా అవార్డ్స్

ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. దీన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం అందిస్తుంది. భారతదేశంలో సహా అనేక దేశాల విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ ద్వారా చదువుకునే అవకాశం లభిస్తుంది.

ఈ స్కాలర్‌షిప్పులు చదువుకు అయ్యే ఖర్చుతో పాటు విదేశాల్లో జీవించడానికి కూడా ఆర్థికసాయం చేస్తాయి.

77
ఆర్థిక స్థితి ఆధారంగా స్కాలర్ షిప్స్

పైన చెప్పినవి మెరిట్ ఆధారంగా ఇచ్చే స్కాలర్‌షిప్పులు. ఆర్థిక స్థితి ఆధారంగా ఇచ్చేవి కూడా ఉన్నాయి. వాటిలో కొన్నింటిగురించి ఇక్కడ తెలుసుకుందాం. 

1. కె.సి. మహీంద్రా స్కాలర్‌షిప్ : దీన్ని కె.సి మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (KCMET) అందిస్తుంది. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే అభ్యర్థులకు ఆర్థిక సాయం అందిస్తారు.

2.  నరోత్తమ్ శేఖ్సరియా స్కాలర్‌షిప్ : దేశంలోనే కాదు విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనే అభ్యర్థులకు ఈ స్కాలర్ షిప్ అందిస్తారు.

3. జె.ఎన్. టాటా ఎండోమెంట్ లోన్ స్కాలర్‌షిప్ : విదేశాల్లో మాస్టర్స్, పిహెచ్డి, పోస్ట్ డాక్టోరల్ అద్యయనాలు చేయడానికి ఈ స్కాలర్ షిప్స్ అందిస్తారు.1892 నుండి ఈ స్కాలర్ షిప్స్ అందిస్తున్నారు.

ఇవి మొత్తం ఖర్చు భరించకపోవచ్చు. 25-50% వరకు తగ్గించి సాయం చేస్తాయి. లేదా వడ్డీలేని రుణాలు అందిస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories