కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) వివిధ ఖాళీలను భర్తీకి ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది ఒక అరుదైన అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 99 ఖాళీలు భర్తీచేయనున్నట్లు ప్రకటించారు.
25
పోస్టుల వారీగా పూర్తి వివరాలు
ఈ ఉద్యోగ ప్రకటనలో ఇంజనీరింగ్ (కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మైనింగ్, కెమికల్), హ్యూమన్ రిసోర్సెస్, సైన్స్ గ్రాడ్యుయేట్లను అర్హులుగా ప్రకటించారు. మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) విభాగంలో నెలకు రూ.40,000 జీతం, ఇతర ట్రైనీ విభాగాలకు రూ.29,990 జీతం ప్రకటించారు. ప్రతి విభాగానికి అవసరమైన విద్యార్హతలు స్పష్టంగా పేర్కొనబడ్డాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు వెంటనే అప్లై చేయవచ్చు… ఇప్పటికు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రిియ ప్రారంభమయ్యింది. సెప్టెంబర్ 24, 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము రూ.500గా నిర్ణయించారు. అయితే మహిళలు, SC/ST, దివ్యాంగులకు రుసుము లేదు. GATE 2025 లేదా UGC-NET వంటి పరీక్షలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
55
ప్రభుత్వ ఉద్యోగ అవకాశం
కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే అద్భుతమైన అవకాశం కాబట్టి ఆసక్తి గలవారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక ప్రకటనను పూర్తిగా చదివి, అవసరమైన అర్హతలు తమకు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్నవారికి ఈ ప్రకటన మంచి మార్గదర్శకంగా ఉంటుంది.