జీవితం అన్నాక కష్టాలు రావడం సర్వసాధారణం. కానీ మనలో చాలా మంది కష్టాలకు భయపడుతుంటారు. అయితే జీవితంలో సర్వస్వం కోల్పోయినా సరే. కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే కచ్చితంగా విజయాన్ని అందుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండదు. కష్టాలు రావడం సర్వసాధారణం. అనుకున్న పనులు జరగవు. మనవాళ్లు అనుకున్న వాళ్లు పగవారుగా మారుతారు. చేతిలో ఉన్న అవకాశాలన్నీ చేజారి పోతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం దక్కదు. మన దగ్గర ఏం లేదనే నిరూత్సాహంలో కూరుకుపోతాం. అయితే జీవితంలో ఈ విషయాలు గుర్తు పెట్టుకుంటే అసలు ఓటమి అనే మాటకు స్థానమే ఉండదు.
24
నెగిటివ్ విషయాలకు దూరంగా
* నీ వల్ల కాదు, నువ్వు ఓడిపోతావు అంటూ నిన్ను వెనక్కి లాగే వారు చాలా మంది ఉంటారు. అయితే అలాంటి వారి మాటలను ఎప్పుడూ వినకూడదు. ఇలాంటి నెగిటివ్ మాటలను వింటే అదే మీ వైఫల్యానికి మొదటి కారణం అవుతుందని గుర్తు పెట్టుకోండి.
* జీవితంలో విజయం సాధించాలంటే మీ లక్ష్యంపైనే దృష్టి పెట్టండి. మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దృష్టిని మళ్లించే అంశాలు వచ్చినా విజయం కోసమే ప్రయత్నించండి. అలా వెళ్తూ పోతే ఏదో ఒక రోజు కచ్చితంగా విజయం వరిస్తుంది.
34
పట్టుదల ఉండాలి
* సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. జీవితంలో ఏది కోల్పోయినా ఇది పట్టుదల ఉంటే అనుకున్నదాన్న సాధించవచ్చు.
* జీవితంలో విజయాన్ని సాధించాలంటే చేజారిపోయిన దాని గురించి బాధపడడం మానేయాలి. గడిచిన క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవద్దు. వీలైతే దాని నుంచి ప్రేరణ పొందాలి కానీ ఢీలా పడకూడదు.
* జీవితంలో విజయం సాధించాలంటే చేసే పనిని ఎప్పుడూ వాయిదా వేయకండి. వాయిదా వేయడం వల్లే చాలా మంది ఫెల్యువర్స్‌గా మిగిలిపోతారు. ఏ పని అనుకున్నా సరే ముందు దానిని పూర్తి చేసే వరకు వదిలి పెట్టకండి.
* చాలా మంది తమకు అవకాశం దక్కడం లేదని బాధడుతుంటారు. అదే తమ వైఫల్యానికి కారణమని అనుకుంటారు. కానీ అవకాశాన్ని సృష్టించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. శూన్యంలో కూడా అద్భుతం సృష్టించవచ్చనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.