Exam Tips : టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులూ… తీవ్ర ఒత్తిడి, ఆందోళనతో సరిగ్గా చదవలేకపోతున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించి టెన్షన్ తగ్గించుకొండి.
Exam Tips : ప్రస్తుతం పరీక్షల సమయం కొనసాగుతోంది... విద్యార్థులంతా చదువుల్లో మునిగిపోయారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి... ఆ తర్వాత పదోతరగతి పరీక్షలుంటాయి. ఇతర తరగతుల విద్యార్థులు కూడా ఫైనల్ ఎగ్జామ్స్ కు సిద్దమవుతున్నారు. వచ్చే రెండు నెలల్లో ప్రతి విద్యార్థి పరీక్ష రాయాల్సిందే.
అయితే ఈ పరీక్షల వేళ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు.. బాగా చదువుకున్నా పరీక్షలు ఎలా రాస్తామో అన్న ఆందోళన ఉంటుంది. పరీక్షలో మనం చదువుకున్న టాపిక్స్ వస్తాయా..? ఎగ్జామ్స్ ఎలా రాస్తామో... అసలు పాస్ అవుతామా లేదా..? పేరెంట్స్ ఆశలను నెరవేర్చగలమా…? ఇలా అనేక అనుమానాలతో టెన్షన్ పడుతుంటారు. ఈ ఆందోళన, ఒత్తిడితో విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టలేరు... తెలిసిన విషయాలు కూడా మర్చిపోతారు. అందుకే ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లడం చాలా ముఖ్యం... ఇలాగైతే విద్యార్థులు పరీక్షల్లో సగం పాస్ అయినట్లే. కాబట్టి ప్రస్తుత ప్రిపరేషన్ సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించుకునేందుకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ నిపుణులు, ప్రముఖ మెంటార్ బాలలత సూచించే చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
26
1. మనసు, మెదడును ఇలా కంట్రోల్ చేయండి...
పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు తమ మనసును, మెదడును సమన్వయం చేసుకోవాలి. మనం చదువుకున్న ప్రతి టాపిక్ ఎగ్జామ్ లో వస్తుందని బావించాలి... అప్పుడే దానిపై పూర్తి ఏకాగ్రత పెట్టగలం. ఇలా చదివిన టాపిక్స్ ఎగ్జామ్ లో వస్తాయని నమ్మితే ఒత్తిడి బాగా తగ్గుతుంది... తద్వారా మనసులో ఆందోళన కూడా తగ్గుతుంది. ఇలా మనసు, మెదడును కంట్రోల్ చేసి ప్రశాంతంగా ప్రిపరేషన్ కొనసాగించండి.
36
2. ఎగ్జామ్ హాల్లో హ్యాపీగా ఉన్నట్లు ఊహించుకొండి...
మనం ఏదైనా పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది... ఎగ్జామ్ లో కూడా అంతే. మనం పరీక్ష బాగారాస్తే బయటకు రాగానే మనసు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్ హాల్లో అద్భుతంగా పరీక్ష రాసినట్లు ఊహించుకొండి... ప్రతి ప్రశ్నకు సమాధానం తెలిసినట్లు, చక్కగా జవాబు రాసినట్లు విజువలైజ్ చేసుకొండి. ఇది మీ ఒత్తిడిని తగ్గించి మరింత బాగా ప్రిపరేషన్ కొనసాగించేలా చేస్తుంది.
ఎగ్జామ్ ఎలా రాస్తామో అన్న భయంతో ప్రిపేర్ అవుతుంటే ఒత్తిడికి గురవడం ఖాయం. అలాకాకుండా ఆల్రెడీ పరీక్ష అద్భుతంగా రాశాను... రిజల్ట్ కూడా బాగా వచ్చిందని పాజిటివ్ గా ఊహించుకోవాలి. అప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది... దీంతో మెదడుపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఊహల్లోని సక్సెస్ ను నిజం చేయాలనే పట్టుదలతో చదవండి... ఎగ్జామ్ కు అదే మైండ్ సెట్ తో వెళ్లండి. ఇలా చేశారో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.
56
4. కౌన్సెలింగ్ తీసుకొండి...
చదువు ఒత్తిడి, పరీక్షల ఆందోళన నుండి బయటపడేందుకు ప్రిపరేషన్ సమయంలో స్నేహితులు, పేరెంట్స్ తో కొంత సమయం గడపండి. మీ ఒత్తిడి గురించి టీచర్లతో చర్చించండి... దీంతో వాళ్లు మీకు అండగా నిలిచి ధైర్యం చెబుతారు. ఇలా పేరెంట్స్, ప్రెండ్స్, టీచర్ల భరోసా, కౌన్సెలింగ్ ఒత్తిడిని బాగా తగ్గిస్తాయి.
66
5. ఈ ఎగ్జామ్సే జీవితం కాదు
కేవలం చదువు, పరీక్షలే జీవితం కాదనే నిజం తెలుసుకోవాలి. జీవితంలో ఎగ్జామ్స్ కేవలం ఓ చిన్న పార్ట్ మాత్రమే... దీనికోసం ఇంతలా ఆందోళన చెందడం ఎందుకు..? అని మీకు మీరు ప్రశ్నించుకుంటే చాలు. ఎంతటి ఎగ్జామ్ టెన్షన్ అయినా మటుమాయం అవుతుంది.