అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం – ప్రత్యేక అవగాహన కార్యక్రమం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలోని శ్రీ కనక్య పరమేశ్వరీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఫర్ ఉమెన్.. “Where Language Meets Opportunity in the AI Era” అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భాషా ప్రాముఖ్యతను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 20, 2026న ఉదయం 10:30 గంటలకు కళాశాల ఆడిటోరియంలో జరగనుంది. ఐక్యూఏసీ, తెలుగు, హిందీ & సంస్కృత విభాగాలతో పాటు దుర్గ స్రవంతి కల్చరల్ యూనిట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
రిసోర్స్ పర్సన్‌గా వేణుగోపాల్ బొల్లంపల్లి
ప్రఖ్యాత డిజిటల్ మీడియా నిపుణులు, ఏఐ వ్యూహకర్త వేణు గోపాల్ బొల్లంపల్లి ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా పాల్గొననున్నారు. డిజిటల్ మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తెలుగు ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భాషా కంటెంట్ వ్యూహరచన, డేటా అనలిటిక్స్, ప్రేక్షకుల ప్రవర్తన విశ్లేషణ, AI ఆధారిత కంటెంట్ ఆప్టిమైజేషన్ వంటి అంశాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది.
24
AI యుగంలో తెలుగు భాషకు అవకాశాలు
కృత్రిమ మేథస్సు (AI), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP), డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధితో ప్రాంతీయ భాషలకు కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. తెలుగు వంటి భారతీయ భాషల్లో డిజిటల్ కంటెంట్ క్రియేషన్, భాషా డేటా వినియోగం, ఆటోమేటెడ్ అనువాద వ్యవస్థలు, వాయిస్ టెక్నాలజీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ సందర్భంలో మాతృభాషల ప్రాధాన్యం తగ్గకుండా, మరింత పెరుగుతోందని వేణుగోపాల్ వివరించనున్నారు. భాషా నైపుణ్యం కలిగిన వారికి AI ట్రైనింగ్, కంటెంట్ మోడరేషన్, లాంగ్వేజ్ డేటా అనోటేషన్, డిజిటల్ జర్నలిజం వంటి రంగాల్లో కొత్త కెరీర్ అవకాశాలు ఏర్పడుతున్నాయని ఆయన చర్చించనున్నారు.
34
విద్య, పరిశోధన, నైపుణ్య అభివృద్ధి
వేణుగోపాల్ ప్రస్తుతం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువహటి నిర్వహిస్తున్న డేటా సైన్స్ & బిజినెస్ అనలిటిక్స్ కార్యక్రమంలో అభ్యసిస్తున్నారు. అదేవిధంగా BBC Academy నుంచి అడ్వాన్స్‌డ్ డిజిటల్ జర్నలిజం, మీడియా లా, ఎడిటోరియల్ లీడర్‌షిప్ కోర్సులు పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. పట్టా పొందిన ఆయన భాషా పటిమను సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించే దిశగా పనిచేస్తున్నారు.
ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషల్లో ప్రావీణ్యం కలిగిన వేణుగోపాల్, భాష.. టెక్నాలజీ కలయిక భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్‌ను ఎలా మార్చబోతుందో వివరిస్తారు. ప్రాంతీయ భాషల డిజిటల్ విస్తరణ, స్థానిక కంటెంట్‌కు పెరుగుతున్న డిమాండ్, AI ఆధారిత ప్లాట్‌ఫామ్‌లలో భాషా నిపుణుల అవసరం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కేవలం లాంగ్వేజ్‌కి సంబంధించిన విద్యార్థులు మాత్రమే కాకుండా టెక్నాలజీ, మీడియా, జర్నలిజం రంగాలపై ఆసక్తి ఉన్నవారికి కూడా స్పష్టమైన దిశా నిర్దేశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.