Most Expensive Homes ప్రపంచంలో ఇవే అత్యంత ఖరీదైన ఇళ్లు.. ముకేశ్ అంబానీ స్థానం ఎంతంటే..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగ్లాలు: ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే మనం సకల సౌకర్యాలు ఉన్న బ్రహ్మాండమైన ఇంటిని కట్టుకోవచ్చు. మరి వేల కోట్లతో నిర్మించారంటే.. వాటిలో విలాసాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విలాసాల ఇళ్లు.. వాటి నిర్మాణానికి అయిన ఖర్చు తెలుసుకుందాం.  

Worlds most expensive homes mukesh ambani antilia larry ellison in telugu
1- బకింగ్‌హామ్ ప్యాలెస్

బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు. ఇది బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-II  రాజ నివాసం. 775 గదుల ఈ ఇంటి ధర 4.9 బిలియన్ డాలర్లు అంటే 42,140 కోట్ల రూపాయలు.

Worlds most expensive homes mukesh ambani antilia larry ellison in telugu
2- అంటిలియా

అంటిలియా ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన బంగ్లా. ముంబైలోని అల్టమాౌంట్ రోడ్డులో ఉన్న ముఖేష్ అంబానీ 27 అంతస్తుల ఈ ఇంటి ధర 2 బిలియన్ డాలర్లు అంటే 17,200 కోట్ల రూపాయలు.


3- విల్లా లియోపోల్డా

విల్లా లియోపోల్డా ప్రపంచంలోనే మూడవ అత్యంత ఖరీదైన బంగ్లా. ఫ్రాన్స్‌లో ఉన్న ఈ విలాసవంతమైన ఇల్లు 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది, దీని ధర 750 మిలియన్ డాలర్లు అంటే 6,450 కోట్ల రూపాయలు.

4- విల్లా లెస్ సెడ్రెస్

విల్లా లెస్ సెడ్రెస్ ప్రపంచంలోనే నాల్గవ అత్యంత ఖరీదైన బంగ్లా. సెయింట్ జీన్‌లో 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి ధర 450 మిలియన్ డాలర్లతో నిర్మించారు. అంటే దీని విలువ 3,870 కోట్ల రూపాయలు.

5- లెస్ ప్యాలెస్ బుల్స్

లెస్ ప్యాలెస్ బుల్స్ ప్రపంచంలోనే ఐదవ అత్యంత ఖరీదైన ఇల్లు. ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో ఉన్న ఈ విలాసవంతమైన ఇంటి ధర 420 మిలియన్ డాలర్లు అంటే సుమారు 3,612 కోట్ల రూపాయలు. ఈ ఇంట్లో కొండవాలు ప్రాంతంలో 500 సీట్లతో కూడిన ఒక ఆంఫిథియేటర్ కూడా ఉంది.

6- ది ఓడియన్ టవర్

ది ఓడియన్ టవర్ పెంట్‌హౌస్ ప్రపంచంలోనే ఆరవ అత్యంత ఖరీదైన ఇల్లు. మొనాకోలో ఉన్న ఈ విలాసవంతమైన ఇంటి ధర 330 మిలియన్ డాలర్లు అంటే 2,838 కోట్ల రూపాయలు. ఈ విలాసవంతమైన ఇల్లు 38000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టారు.

7- ది హోమ్

ది హోమ్ ప్రపంచంలోనే ఏడవ అత్యంత ఖరీదైన ఇల్లు. లండన్‌లో ఉన్న ఈ ఇంటి ధర 300 మిలియన్ డాలర్లు అంటే 2,580 కోట్ల రూపాయలు.

8- ఫోర్ ఫెయిర్‌ఫీల్డ్ పాండ్

ఫోర్ ఫెయిర్‌ఫీల్డ్ పాండ్ ప్రపంచంలోనే ఎనిమిదవ అత్యంత ఖరీదైన ఇల్లు. న్యూయార్క్‌లో ఉన్న ఈ ఇల్లు అమెరికాలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. దీని ధర 250 మిలియన్ డాలర్లు అంటే 2,150 కోట్ల రూపాయలు.

9- కెన్సింగ్టన్ గార్డెన్స్ ప్యాలెస్

కెన్సింగ్టన్ గార్డెన్స్ ప్రపంచంలోనే తొమ్మిదవ అత్యంత ఖరీదైన ఇల్లు. లండన్‌లో నిర్మించిన ఈ విలాసవంతమైన ఇంటి ధర 222 మిలియన్ డాలర్లు అంటే 1,909 కోట్ల రూపాయలు. ఈ ఇంట్లో స్పా, స్టీమ్ షవర్, సోనా బాత్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.

Latest Videos

vuukle one pixel image
click me!