చట్టం ప్రకారం.. ఇప్పుడు ఘనా గోల్డ్‌బోర్డ్ మాత్రమే లైసెన్స్ పొందిన చిన్న తరహా మైనర్ల నుంచి బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. ఆ బోర్డే సొంతంగా బంగారాన్ని ఎగుమతి చేస్తుంది. గోల్డ్‌బాడ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా వ్యాపారం చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. గతంలో ఎగుమతి లైసెన్సులు కలిగిన స్థానిక, విదేశీ కంపెనీలు ఘనా గని కార్మికుల నుంచి బంగారాన్ని కొనుగోలు చేసి విదేశాలకు పంపేందుకు అవకాశం ఉండేది. కానీ, కొత్త రూల్స్ ప్రకారం అలా చేయడం కుదరు. పార్లమెంట్ మార్చి 29న ఘనా గోల్డ్ బోర్డ్ బిల్లును ఆమోదించింది. అధ్యక్షుడు జాన్ డ్రామణి మహామా సంతకంతో ఇది చట్టమైంది. దీంతో ఆ దేశంలో యధేచ్ఛగా సాగే బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఘనా విదేశీ మారక నిల్వలు పెరిగే అవకాశాలున్నాయి. ‘గెలామ్సే’ పేరుతో అక్రమ బంగారం మైనింగ్ అక్కడ అతి పెద్ద సమస్య. ఈ కొత్త చట్టంతో దీనికి అడ్డుకట్ట పడనుంది. అక్కడి నుంచి తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి, అంతర్జాతీయ మార్కెట్లో భారీగా లబ్ది పొందుతున్న విదేశీయులకు ఇది అశనిపాతమే.