ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీలో యాప్ స్విగ్గీ ఇప్పుడు కొత్త ప్రొడక్ట్‌తో సర్వీస్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. 'పింగ్' అనే ఈ కొత్త యాప్ AI ఆధారితం. దీని ద్వారా ప్లంబర్, ఎలక్ట్రీషియన్, క్లీనింగ్ వంటి ప్రొఫెషనల్ సర్వీసులను సులభంగా పొందవచ్చు.
ఎక్స్‌పర్ట్ సర్వీసులు ఇట్టే మీ సొంతం:
మంగళవారం బెంగళూరులో లాంచ్ అయిన ఈ యాప్ ద్వారా యోగా ట్రైనర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు, లాయర్లు వంటి నిపుణుల సేవలను కూడా పొందవచ్చు. 'పింగ్' కోసం స్విగ్గీ ముందుగా 'ఎల్లో' అనే పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీని ఉద్దేశం న్యాయవాదులు, జ్యోతిష్యులు, థెరపిస్టుల వంటి నిపుణులను కస్టమర్లకు అందుబాటులోకి తేవడం. జనవరి నుంచి ప్రొఫెషనల్స్ ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. 'పింగ్' ద్వారా మీకు దగ్గర్లో ఉన్న నమ్మకమైన ప్రొఫెషనల్స్ గురించి తెలుసుకోవచ్చు.