Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !

Published : May 18, 2026, 08:55 PM IST

India Gold Ranking: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలొ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి చాలా దేశాలు గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. మరి ప్రపంచంలోనే అత్యధిక గోల్డ్ రిజర్వ్స్ ఉన్న దేశం ఏది? ఇండియా ఏ స్థానంలో ఉంది?

PREV
14
ఈ దేశాల దగ్గర ఉన్న బంగారం చూస్తే దిమ్మతిరగడం ఖాయం.. ఆ లిస్ట్ ఇదే!

బంగారాన్ని ఎప్పుడూ ఆస్తికి, ఆర్థిక భద్రతకు చిహ్నంగా భావిస్తారు. కేవలం నగలు లేదా పెట్టుబడి కోసమే కాకుండా, ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు కూడా భారీ మొత్తంలో బంగారాన్ని నిల్వ ఉంచుకుంటాయి. ఈ గోల్డ్ రిజర్వ్స్ అనేవి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. అంతేకాదు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతాయి. మరి ఇంతకీ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉన్న దేశం ఏదో మీకు తెలుసా?

24
సేఫ్ హెవెన్ అసెట్ అంటే ఏంటి?

ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకులు తమ దగ్గర బంగారాన్ని ఉంచుకోవడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఇది ఫారెక్స్ రిజర్వ్స్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇన్వెస్టర్లలో భరోసాను నింపుతుంది. పేపర్ కరెన్సీలాగా బంగారాన్ని నచ్చినట్లు ప్రింట్ చేయలేం కదా.. అందుకే దీన్ని సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ లేదా 'సేఫ్ హెవెన్ అసెట్' అని పిలుస్తారు. ఇప్పటివరకు భూమిపై నుంచి తీసిన మొత్తం బంగారం సుమారు 2,16,000 టన్నులకు పైగా ఉంటుందని అంచనా.

34
బంగారం నిల్వలు.. టాప్ 10లో భారత్ పొజిషన్ ఇదే

మన దేశానికి బంగారంతో ఉన్న సాంస్కృతిక, ఆర్థిక బంధం చాలా పాతది. అందుకే ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భారత దేశ అధికారిక గోల్డ్ రిజర్వ్స్ చూస్తే.. మన దగ్గర 800 టన్నుల కంటే ఎక్కువ బంగారం ఉంది. ఈ భారీ నిల్వలతో భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కలిగిన టాప్ 10 దేశాల జాబితాలో చేరింది. ఈ లిస్టులో భారత్ 8వ స్థానంలో కొనసాగుతోంది.

44
బంగారం నిల్వలు.. నంబర్ వన్ దేశం ఇదే

ప్రపంచంలోనే అత్యధిక గోల్డ్ రిజర్వ్స్ ఉన్న దేశంగా అమెరికా రికార్డుల్లో నిలిచింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం.. అమెరికా దగ్గర ఏకంగా 8,100 టన్నులకు పైగా బంగారం ఉంది. ఇందులో చాలా భాగాన్ని కెంటుకీలోని ప్రసిద్ధ ఫోర్ట్ నాక్స్ లో భద్రపరిచారు. మిగిలిన బంగారాన్ని డెన్వర్, వెస్ట్ పాయింట్ వంటి సూపర్ సెక్యూర్డ్ ప్లేస్‌లలో దాచారు. అమెరికా 20వ శతాబ్దంలోనే తన గోల్డ్ రిజర్వ్స్‌ను పెంచడం స్టార్ట్ చేసింది.

మరికొన్ని దేశాల విషయానికి వస్తే.. జర్మనీ 3,300 టన్నుల కంటే ఎక్కువ బంగారంతో రెండో స్థానంలో ఉంది. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల దగ్గర 2,400 టన్నుల కంటే ఎక్కువ బంగారం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న రష్యా, చైనాలు కూడా ఇటీవల కాలంలో తమ గోల్డ్ రిజర్వ్స్‌ను బాగా పెంచుకుంటూ వస్తున్నాయి. వీటితో పాటు స్విట్జర్లాండ్, జపాన్ దేశాలు కూడా అత్యధిక బంగారం ఉన్న దేశాల లిస్ట్‌లో ముందంజలో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories