Gold Price Fall: బంగారం మళ్లీ డౌన్ ఫాల్.. వెండి కొండెక్కింది. హైదరాబాద్‌లో ఇవాళ్టి రేట్లు ఇవే!

Published : May 18, 2026, 11:36 AM IST

Gold Price Fall: నాలుగు రోజుల్లో రూ.10 వేల వరకు పెరిగిన బంగారం… ఇప్పుడు మళ్లీ కుప్పకూలిపోతుంది. వెండి దిగుమతులపై కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయంతో మార్కెట్‍ గందరగోళంలో కూరుకుంది. హైదరాబాద్‌లో ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

PREV
15
భారీ పతనంలోకి పసిడి

గత వారం వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు భారీ పతనంలోకి వెళ్లాయి. కొద్ది రోజుల క్రితం వరకు రికార్డు స్థాయికి చేరుకున్న గోల్డ్ రేట్లు, ఇప్పుడు రోజురోజుకూ తగ్గుతూ కొనుగోలుదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 

25
రూ.1,56,220కి చేరిన మేలిమి బంగారం

ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.710 తగ్గి రూ.1,56,220కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.650 తగ్గడంతో 10 గ్రాములు రూ.1,43,200గా నమోదైంది. 18 క్యారెట్ బంగారం ధర కూడా భారీగా పడిపోయి రూ.1,17,170 వద్ద ట్రేడ్ అవుతోంది. గత నాలుగు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.6 వేలకుపైగా తగ్గడం మార్కెట్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. వెండి ధరలు కూడా ఇదే దారిలో పయనిస్తున్నాయి. అయితే వెండిపై ఇవాళ రూ.10వేలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3లక్షలకు చేరుకుంది. 

35
బంగారం మార్కెట్‌పై ఒత్తిడి

ఇక మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రం కావడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. ఆయిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ పెరిగాయి. సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉంటాయి. అదే పరిస్థితి ఇప్పుడు బంగారం మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతోంది. 

45
వెండిపై భారీ దిగుమతి సుంకాలు

ఇదే సమయంలో భారత్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను భారీగా పెంచడమే కాకుండా, కొన్ని రకాల వెండి బార్ల దిగుమతులను “రిస్ట్రిక్టెడ్” కేటగిరీలోకి తీసుకువచ్చింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన సిల్వర్ బార్ల దిగుమతులపై నియంత్రణలు పెట్టడంతో వెండి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 

55
గందరగోళంలో మార్కెట్లు

ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఆయిల్ ధరలు, అమెరికా వడ్డీ రేట్లపై ఉన్న అనిశ్చితి, భారత్ తీసుకుంటున్న దిగుమతి నిర్ణయాలు కలిసి ఇప్పుడు బంగారం, వెండి మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories