బట్టలు, వస్తువులపై జి‌ఐ ట్యాగ్ అంటే ఏమిటి, ఏ ఉత్పత్తికి లభిస్తుంది ? ప్రతిదీ తెలుసుకొండి..

First Published Oct 27, 2021, 1:05 PM IST

 మీరు తరచుగా ఒక ఉత్పత్తి జి‌ఐ (GI) ట్యాగ్ గురించి వినే ఉంటారు, కానీ జి‌ఐ ట్యాగ్ అంటే ఏమిటి, దానిని ఎందుకు, దేనికి పెడతారో తెలుసా ? నిజానికి ఏ వస్తువుకైనా జి‌ఐ ట్యాగ్ చాలా ముఖ్యం. ఈ ట్యాగ్‌లు ఉత్పత్తి(product) ఎక్కడ నుండి వచ్చిందో తెలియజేస్తాయి, అంటే ఈ ట్యాగ్‌లు ఉత్పత్తికి  గుర్తింపు.

 జి‌ఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ (geographical indication). దీనిని ఒక జియోగ్రాఫికల్   అరిజిన్ ఉత్పత్తుల కోసం ఉపయోగించబడుతుంది. ఒక ఉత్పత్తి ఈ ప్రత్యేక భౌగోళిక గుర్తింపును పొందడం ద్వారా ఆ  వస్తువు ఉత్పత్తిదారులు దానికి మంచి ధరను పొందుతారు. అలాగే   జి‌ఐ ట్యాగ్ పొందిన  వస్తువు పేరును ఉపయోగించి ఇతర ఉత్పత్తిదారులు  మార్కెట్ చేయకుండ ప్రయోజనం కూడా ఉంది.  జి‌ఐ ట్యాగ్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు అవసరమో తెలుసుకుందాం ..? 

 జి‌ఐ చట్టం 2003లో పార్లమెంట్‌లో ఆమోదించింది. భారతదేశం హెరిటేజ్, గుర్తింపును కాపాడటానికి అలాగే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చెందడానికి  చట్టపరమైన కసరత్తు. వాస్తవానికి భారతదేశంలోని ప్రసిద్ది చెందిన ఉత్పత్తులను కాపీ చేయడం ద్వారా నకిలీ వస్తువులు మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.

దీని కారణంగా దేశ హెరిటేజ్, గుర్తింపు పొందిన వస్తువులకు ముప్పుగా భావించింది, ఆ తర్వాత అసలు(original) ఉత్పత్తుల గౌరవాన్ని కాపాడేందుకు జి‌ఐ ట్యాగ్ చట్టం తీసుకువచ్చింది. 

వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం ద్వారా జి‌ఐ ట్యాగ్ ఇవ్వబడుతుంది. దీని రిజిస్ట్రేషన్ 10 సంవత్సరాలు చెల్లుతుంది. ఈ ట్యాగ్ ని ఒక నిర్దిష్టమైన పంట, న్యాచురల్ అండ్ తయారైన ఉత్పత్తులకు ఇవ్వబడుతుంది. 2004లో డార్జిలింగ్ టీ దేశంలో మొదటిసారిగా జి‌ఐ ట్యాగ్‌ని పొందింది.

ఇప్పటివరకు దేశంలో 300 కంటే ఎక్కువ ఉత్పత్తులు జి‌ఐ ట్యాగ్‌ను పొందాయి. వీటిలో హిమాచల్ నుండి నల్ల జీలకర్ర, ఛత్తీస్‌గఢ్ నుండి జీలకర్ర, ఒడిశా నుండి కంధమాల్ పసుపు, కర్నాటక నుండి కూర్గ్ అరబికా కాఫీ, కేరళలోని వాయనాడ్ నుండి రోబస్టా కాఫీ, ఆంధ్ర ప్రదేశ్ నుండి అరకు వ్యాలీ అరబికా, కర్ణాటక నుండి సిర్సీ తమలపాకులు ఉన్నాయి. 

click me!