ఒకవేళ ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంటే సమీప విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయవచ్చు. ప్రయాణికుడు అప్పటికే మరణించి ఉంటే, ఆ విషయాన్ని విమానంలో ఉన్న ఎవరైనా డాక్టర్లు నిర్ధారిస్తే ల్యాండింగ్ చేయడానికి లేదు.
మరి ఆ శవాన్ని అలాగే ఉంచి విమానం గమ్యస్థానం చేరుకొనే వరకు ప్రయాణించాల్సిందేనా అంటే.. అవసరం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని హైటెక్ విమానాలలో కార్ప్స్ లాకర్ అనే ప్లేస్ ఉంటుంది. ఇలా ఎవరైనా విమానం గాల్లో ఉండగా చనిపోతే ఆ శవాన్ని గౌరవంగా కార్ప్స్ లాకర్ లో ఉంచుతారు. అది లేని విమానాల్లో సిబ్బంది వచ్చి ఆ శవాన్ని ప్రయాణికులకు దూరంగా ఖాళీ సీటులో ఉంచుతారు. లేదా బిజినెస్ క్లాస్‌లో పడుకోబెడతారు.