Automatic Cars: ఆటోమేటిక్ కార్ కొనాలనుకుంటున్నారా? చవక ధరకే వచ్చే టాప్ 5 కార్లు ఇవిగో

Published : Feb 22, 2026, 09:00 AM IST

Automatic Cars: ఒకప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటివి కేవలం లగ్జరీ కార్లలోనే ఉండేవి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది.  తక్కువ బడ్జెట్‌లోనే అదిరిపోయే ఆటోమేటిక్ కార్లు ఇప్పుడు  మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ.12 లక్షల్లోపే వచ్చేస్తాయి.

PREV
15
టాటా పంచ్

టాటా మోటార్స్‌కు చెందిన పాపులర్ ఎస్‌యూవీ కారు ఇది. దీనిలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు దీని స్టీరింగ్ చాలా తేలికగా ఉంటుంది. ఇది డ్రైవింగ్ అనుభవాన్ని చాలా సులువు చేసేస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7,54,900. ఆన్ రోడ్ ధర మరో లక్ష నుంచి లక్షన్నర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

25
కియా సోనెట్

కియా కంపెనీకి చెందినది కియా సోనెట్. ఇప్పుడు ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ మోడల్ ఇదే. ఈ ఎస్‌యూవీ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.10.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆన్ రోడ్ ధర  12 లక్షల రూపాయలకు వచ్చేస్తుంది.

35
మారుతి సుజుకి ఫ్రాంక్స్

మారుతి సుజుకి కొత్త ఎస్‌యూవీ మోడల్ ఫ్రాంక్స్. ఈ కారులో 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 90hp పవర్, 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ధర రూ.8.55 లక్షలు. అదే ఆన్ రోడ్ ధర పదిలక్షల రూపాయలకు వచ్చేస్తుంది.

45
నిస్సాన్ మాగ్నైట్ ఆటోమేటిక్

నిస్సాన్ మాగ్నైట్ CNG మోడల్‌లో ఇప్పుడు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6,21,000 నుంచి మొదలవుతుంది. ఇది చాలా తక్కువ ధర. ఆన్ రోడ్ ధర 8 లక్షల రూపాయలకే వస్తుంది.

55
టాటా నెక్సాన్

మీరు టాటా నెక్సాన్ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే దీనిలో ఆటోమేటిక్ వేరియంట్ ఎంపిక చేసుకోవచ్చు. దీన్ని  ఎక్స్-షోరూమ్ ధర రూ.9,51,390గా ఉంది. అదే ఆన్ రోడ్ ధర 12 లక్షల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories