Gold Price : బంగారం ధర తగ్గుతుందా..? లక్ష రూపాయలకు చేరుకుంటుందా..?

Published : Feb 21, 2026, 07:40 PM IST

బంగారం ధర ఇప్పుడు లక్షాఅరవై.. తగ్గుతుందా… తగ్గనీ.. ఎంత లక్ష ముప్పైకి వస్తుంది లేదా లక్షా ఇరవై. ఇంకా ఘోరం అనుకొంటే లక్షకు చేరుకుంటుంది… ఏమవుతుంది? ఏమీ కాదు… అక్కడే పడుకోదుగా..? మళ్ళీ పెరుగుతుందిగా.

PREV
15
బంగారం ధర తగ్గుతుంది .. కానీ అమ్మడం మంచిది కాదా?

1. బంగారం ధర డాలర్ బలంపై ఆధారపడింది.

వివిధ దేశాలు డాలరేతర వాణిజ్యంపై మొగ్గు చూపడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీన పడడంలాంటి కారణాల వల్ల బంగారం ధరలు పెరిగాయి.

రెండేళ్ల క్రితం 60 వేలు వున్నప్పుడు... బంగారం కొనండి అని చెప్పాను.

కొన్ని నెలలకు అది 90 అయ్యింది. అప్పుడు మీడియాలో బంగారం ధర 40 వేలకి పడిపోతుంది అని పెద్ద ఎత్తున వార్తా విశ్లేషణలు వచ్చాయి. "వాటిని పట్టించుకోవద్దు బంగారం ఇంకా పెరుగుతుంది" అని చెప్పాను.

బంగారం ధర లక్షా ముప్పై అయ్యింది. పెరుగుతూ లక్ష అరవైకి చేరింది.

25
బంగారం తగ్గే అవకాశాలు... ఎందుకో తెలుసా?

2. మూడు వారాల క్రితం దాకా అమెరికా, ఇరాన్ యుద్ధం అనివార్యం అనిపించింది.

ఇది చిలికి చిలికి గాలివానగా మారి ప్రపంచ యుద్ధం అవుతుందేమో అని ఆందోళనలు.

అందుకే స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. బంగారం ధరలు భారీగా పెరిగాయి.

ట్రంప్ లోని బిజినెస్ మాన్ గెలుస్తాడా? లేక యుధ్దోన్మాదా? అని పోస్ట్ కూడా పెట్టాను .

ప్రస్తుతానికి ట్రంప్ బిజినెస్ మాన్ గానే నిలిచాడు. ఇరాన్ యుద్ధం జరిగే అవకాశం తగ్గిపోయింది.

రష్యా తో కూడా డీల్ కుదిరే అవకాశం. అంటే సుస్థిర పరిస్థితులు.. డాలర్ బలపడుతోంది. అందుకే బంగారం ధర తగ్గే అవకాశం.

అయినా అమ్మొద్దు .. ఎందుకంటే ?

1. ధర తక్కువ వున్నప్పుడు కొనడం.. పెరిగినప్పుడు అమ్మడం.. దీన్నే ట్రేడింగ్ అంటారు.

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ తో కోట్లు సంపాదించిన వారున్నారు. మా పూర్వ విద్యార్ధి (2012 పదవ తరగతి బ్యాచ్) సంఖర్ష్ చంద సైంటిఫిక్ ట్రేడింగ్ తో రూ.200 కోట్లు ఆర్జించాడు." ఫైనాన్షియల్ నిర్వహణ" అనే బుక్ కూడా రాశాడు.

ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. సరైన, లోతైన నాలెడ్జితో చెయ్యాలి. కానీ నూటికి తొంబై మంది గుడ్డిగా చేసి భారీగా నష్టపోతారు. ట్రేడింగ్ నా సబ్జెక్టు కాదు. దానికి సంభందించి నేను సూచనలు సలహాలు ఇవ్వను.

35
బంగారం పెట్టబడిలా భావించి కొనండి

2 . మార్కెట్ కరెక్షన్స్ ను పట్టించుకోకండి ..

బంగారం కర్ణుడి కవచకుండలాలు వంటివి.

అప్పు చేసి కొనొద్దు . జీవిత కాల పెట్టుబడిగా కొనండి.

పెళ్ళొద్దు అని కొందరు .. పెళ్లి చేసుకొన్నా పిల్లలు వద్దని కొందరు. ఇవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు కాన్సర్ పేరుతొ గుచ్చేస్తున్నారు. మోడల్స్ ని పట్టుకొచ్చి తెల్ల కోట్లు వేసి మార్కెటింగ్ చేసినా అనుకొన్న ఫలితం రాలేదు. ప్రభుత్వ వ్యవస్థల్ని ఉపయోగించుకొని బడిలోనే అమ్మాయిలకు వేయబోతున్నారు .

రాబొయ్యే రోజుల్లో జనాభా బాగా తగ్గిపోతుంది. పిలల్లు పుట్టడం గగనం అయిపోతుంది .

జనాభా తగ్గితే మంచిది కదా అని ఇప్పటికీ చాలా మంది. బుర్ర లేని వారిని ఎడ్యుకేట్ చెయ్యడం అంత తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు .

వెరసి కలిసి రియల్ ఎస్టేట్ పడిపోతుంది . జనాభా తగ్గుతుంటే కొత్త వాటికి డిమాండ్ తగ్గుతుంది .

కృతిమ మేథ మన జీవితాలను ఏమి చేస్తుంది అని ఆలోచించే జనాలు తక్కువ.

కోవా బన్ను ప్రస్తుతానికి ట్రెండ్ .

రేపు ఇంకొకటి .

నగరాల్లో పెద్ద పెద్ద మాల్స్ లో సరుకు అమ్ముడు పోవడం లేదు. కారణం మనీ సర్కులేషన్ తగ్గింది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులు .. అటు పై నెమ్మదిగా అందరి పై ప్రభావం .

45
బంగారం అమ్మొద్దని పెద్దలే చెబుతారు...

3 . చైనాలో అయితే డబ్బులు లేక పెద్ద పెద్ద కంపెనీలే జీతాలు, బిల్లులు చెల్లించలేని స్థితి. ట్రంప్ తెలివి తేటల్ని, సైనిక బలగాలను ఉపయోగించి ప్రస్తుతానికి డాలర్ ను గట్టెకించాడు. ఇది ఎంత కాలమో తెలియదు. ఫండమెంటల్స్ కు వ్యతిరేకంగా ఎవరూ నడవలేరు.

4 . ఉద్యోగం ఊడింది. వ్యాపారం దెబ్బ తింది. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం తీవ్రమయ్యింది. అప్పుడు ఏమి చేస్తారు?

నేను బంగారం కొనండి .. అంటే బంగారం బాండ్లు అని కొంతమంది భావిస్తున్నారు. ఇలా జరగకూడదు. జరిగిందే అనుకొందాము. బ్యాంకులు దివాళా తీశాయి. అప్పుడు మీ బాండ్లపై డబ్బు వెంటనే ఇస్తారా ?

5.భారత దేశంలో ముసలమ్మకు కూడా తెలుసు. బంగారం అమ్మకూడదు. డబ్బుంటే కొనాలి. తిండికి లేనప్పుడు .. ప్రాణం మీదకు వచ్చినప్పుడు, విధి లేని పరిస్థితుల్లోనే అమ్మాలి. అప్పటి దాక ఆలా ఉండి పోవాలి. తల్లి తరువాత కూతురికి.. కోడలికి. మనాళ్ళు అలాగే బతికారు. కరవులు కాటకాలు అన్నీ అలాగే దాటారు. సోకుల తరం చరిత్రను మరిచింది. క్రెడిట్ కార్డు బతుకులు. రాకూడదు కానీ 1929 పరిస్థితి వస్తే మిడతల్లా మాడి మసై పోతారు.. పాపం .

55
బంగారం ధర ఎప్పుడు పెరుగుతుంది..?

6 . ఇప్పుడు లక్షా అరవై .. తగ్గుతుంది. తగ్గనీ.. లక్ష ముప్పై.. లక్షా ఇరవై. ఇంకా ఘోరం అనుకొంటే లక్ష.

ఏమవుతుంది ? అక్కడే పడుకుంటుందా? మళ్ళీ పెరుగుతుంది . ప్రపంచం చల్లగా ఉంటే ధర నెమ్మదిగా .. సంక్షోభాలు వస్తే వేగంగా పెరుగుతుంది .

7. సంక్షభం రావాలని కోరుకోవద్దు .

వస్తే? తిండి దొరకని పరిస్థితి వస్తే ?

అమ్ముడు పొయ్యేది చేతిలోని బంగారమే. బంగారం ఎప్పటికీ బంగారమే. సురక్షితమయిన పెట్టుబడి. ట్రేడింగ్ చేసేవాడు నష్టపోవచ్చు . కానీ దాన్ని నమ్ముకొన్నవాడు ఎప్పుడూ నష్టపోడు . ఇది అర్థం కావాలంటే తెలివి ఉండాలి . ఆర్థిక పాఠాలు తెలిసుండాలి .

8. అప్పులు చేసి కొనొద్దు .

వెంటనే లాభాలు రావాలని కొనొద్దు . డబ్బుంటే బంగారం కొనండి . ఇప్పుడే కొన్నా ఫరవాలేదు . లేదా మరో రెండు నెలల్లో కాస్త ధర తగ్గాక . ఇప్పుడు అమ్మి ధర తగ్గక అమ్మొచ్చు కదా అని కొంత మంది ప్రశ్న . అది ట్రేడింగ్ . అది నా సబ్జెక్టు కాదు . నేను చెప్పేది జీవన సూత్రం .

వీలయితే నెలనెలా కొనండి . లేదా ఆరునెలలకు ఒక సారి .

అర్థమయితే సంతోషం .

కాకపోతే వదిలెయ్యండి .

Read more Photos on
click me!

Recommended Stories