Published : May 13, 2025, 05:31 PM ISTUpdated : May 13, 2025, 06:32 PM IST
యూపీఐ పేమెంట్స్ భారీగా పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉపయోగం పెరగడం, ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండడంతో యూపీఐ పేమెంట్స్ ప్రతీ ఏటా పెరుగుతున్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ చేయాలంటే కచ్చితంగా అకౌంట్ లో డబ్బులు ఉండాలని తెలిసిందే. అయితే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా లావాదేవీలు చేసుకునే అవకాశం కల్పించారు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
డిజిటల్ లావాదేవీల యుగంలో, ప్రతి ఒక్కరూ నగదుకు బదులుగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ లేదా UPIని ఉపయోగిస్తున్నారు. అయితే యూపీఐ పేమెంట్స్ చేయాలంటే ఇకపై అకౌంట్ లో డబ్బులు ఉండాల్సిన పనిలేదు. ఇందుకోసం యూపీఐ క్రెడిట్ లైన్ పేరుతో కొత్త సేవను ప్రారంభించింది.
210
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, భీమ్ వంటి అన్ని యూపీఐ యాప్స్ లో ఈ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ సేవలు ఎలా ఉపయోగడతాయి.? దీనిని ఎలా ఉపయోగించుకోవాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
310
యూపీఐ సేవలను మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఉద్దేశంతో NPCI కొత్త సేవను ప్రారంభించింది. దీంతో బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా ఉన్నప్పటికీ UPI చెల్లింపులు చేయవచ్చు. యూపీఐ క్రెడిట్ లైన్ పేరుతో కొత్త సేవను ప్రారంభించింది.
సాధారణంగా UPI ID మీ బ్యాంక్ ఖాతాతో లింక్ అవుతుందని తెలిసిందే. మనం పేమెంట్ చేసినప్పుడు సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. రూపే క్రెడిట్ కార్డు ఉన్న వారు క్రెడిట్ కార్డుతో కూడా లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంది.
510
కానీ, ఇప్పుడు NPCI ఒక అద్భుతమైన సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు మీ ఖాతాలో డబ్బు లేకపోయినా UPI చెల్లింపులు చేయవచ్చు. దీని పేరు UPI క్రెడిట్ లైన్.
610
UPI క్రెడిట్ లైన్ కొంతవరకు క్రెడిట్ కార్డ్ లాంటిదని చెప్పొచ్చు. యూజర్ల క్రెడిట్ స్కోర్, వారి లావాదేవీల ఆధారంగా వారికి కొంత మొత్తంలో క్రెడిట్ లిమిట్ ను అందిస్తారు. అయితే దీనిపై ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
710
అయితే ఇందుకోసం మీరు ముందుగా మీ అకౌంట్ ఉన్న బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకుకు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ సేవింగ్స్ అకౌంట్ ఖచ్చితంగా మీ UPI IDతో లింక్ అయి ఉండాలి.
810
ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత బ్యాంకులు ఆమోదం తెలుపుతాయి. ఇలా మీకు కొంత మొత్తంలో క్రెడిట్ లభిస్తుంది. దీంతో ఇకపై మీరు ఖాతాలో డబ్బులు లేకపోయినా లావాదేవీలు చేసుకోవచ్చు.
910
క్రెడిట్ లిమిట్ నుంచి ఉపయోగించుకున్న డబ్బును డబ్బు చెల్లించడానికి మీకు 45 రోజుల సమయం ఉంటుంది. ఇందుకోసం బ్యాంక్ ఎలాంటి వడ్డీ వసూలు చేయదు. అయితే మీరు 45 రోజుల్లోపు డబ్బు చెల్లించకపోతే, మీరు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
1010
ప్రస్తుతం ఈ సర్వీస్ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో అందుబాటులో ఉన్నాయి. BHIM, Paytm, PayZapp, G Pay వంటి అన్ని రకాల యూపీఐ యాప్స్ లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.