Gold Prices: బంగారం కొనాలనుకొనే వారికి గుడ్ న్యూస్: తగ్గిన బంగారం ధర. ఎంత తగ్గిదంటే..

Published : May 13, 2025, 02:43 PM IST

Gold Prices: ఎవరూ ఊహించని విధంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉండగా భారత్-పాక్ యుద్ధం, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం ముఖ్య కారణంగా తెలుస్తోంది. బంగారం ధరలు ఎంతలా తగ్గాయో ఇప్పడు తెలుసుకుందాం. 

PREV
15
Gold Prices: బంగారం కొనాలనుకొనే వారికి గుడ్ న్యూస్: తగ్గిన బంగారం ధర. ఎంత తగ్గిదంటే..

భారత్, పాకిస్తాన్ యుద్ధం ముందు వరకు బంగారం ధర ఆకాశాన్ని తాకేలా దూసుకుపోయింది. అయితే యుద్ధ భయంతో మార్కెట్‌లో గందరగోళం ఏర్పడింది. ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండగా బంగారం ధరలు తగ్గాయి. లక్ష రూపాయల ట్రేడ్ మార్కును దాటిన బంగారం ధర మరింత దూసుకుపోతుందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే అనూహ్యంగా తగ్గడం ప్రారంభమైంది.

25

ఇటీవల పరిణామాలతో ఇప్పుడు బంగారం ధర భారీగా పడిపోయింది. ప్రస్తుతం 98 వేల దగ్గర బంగారం ధర ట్రేడ్ అవుతోంది. యుద్ధం ముగిసి, కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా బంగారం ధరలు దిగజారుతూ ఉండటం బంగారం కొనుగోలు చేయాలనుకొనే వారికి శుభ వార్తే. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. మే 13వ తేదీ నాటి బంగారం ధరలు..

35

మే 12న హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.96,880 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.88,800 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.72,660 దగ్గర ట్రేడ్ అయింది.

మే 13న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.96,870 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.88,790 దగ్గర ఉంది. 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.72,650 దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

45

బంగారం కంటే వెండి ధరలు నిలకడగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధరలైతే పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. వెండి ధరలు మాత్రం ప్రతి రోజు తగ్గుతూనే ఉన్నాయి.

మే 12న 100 గ్రాముల వెండి ధర రూ.10,900 గా నమోదైంది. అంటే కిలో వెండి ధర రూ.1,09000గా నమోదైంది. మే 13న 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది. అంటే 100 గ్రాముల వెండి ధర రూ.10,890, కిలో వెండి ధర రూ.1,08900గా నమోదైంది. 

55

బంగారం కొనాలనుకొనే వారికి ఇదే బెస్ట్ టైమ్..

గోల్డ్ కొనాలనుకొనే వారికి ఇదే బెస్ట్ టైమ్. ఎందుకంటే ప్రపంచ మార్కెట్ ను అనేక దేశాల విషయాలు ప్రభావం చేస్తున్నాయి. మళ్లీ బంగారం ధరలు పెరగకముందే వెంటనే బంగారం కొనుగోలు చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories