UPI: ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ యూపీఐ పేమెంట్స్ ఉపయోగిస్తున్నారు. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్ వరకు యూపీఐ పేమెంట్స్ స్వీకరిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉచితంగా ఉన్న ఈ సేవలకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై ఛార్జీలు వసూలు చేయనున్నారనేది సరదు వార్త సారాంశం. ముఖ్యంగా రూ. 1000కిపైగా చేసే లావాదేదీలపై ఛార్జీలు పడనున్నాయని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై భారత ప్రభుత్వంతో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక ముఖ్యమైన విషయం స్పష్టం చేశాయి. UPI ద్వారా చేసే లావాదేవీలపై సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని తేల్చి చెప్పింది. ఎంత పంపించినా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం UPI ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధించే ప్రణాళిక కూడా లేదని ప్రభుత్వం తెలిపింది.
25
UPI ట్రాన్సాక్షన్లపై RBI ఏం చెప్పింది?
ఇటీవల ఈ విషయం పై వస్తున్న వార్తలపై RBI కూడా స్పందించింది. UPI ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధించేలా ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన లేదని RBI తెలిపింది. అయితే పేమెంట్ సిస్టమ్‌ల నిర్వహణకు కొంత ఖర్చు ఉంటుందని, భవిష్యత్తులో ఆపరేషన్ ఖర్చులను ఎలా నిర్వహించాలనే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. కానీ UPI ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు విధించే తేదీ లేదా ప్రణాళిక ఏదీ ప్రకటించలేదు.
35
NPCI ప్రకారం ఎప్పుడు ఛార్జీలు ఉండొచ్చు?
NPCI ప్రకారం సాధారణంగా బ్యాంక్ నుంచి బ్యాంక్‌కు UPI ద్వారా డబ్బు పంపితే ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఛార్జీలు ఉండొచ్చు. ఉదాహరణకు బ్యాంక్ ఖాతా నుంచి డిజిటల్ వాలెట్ (PPI) కు డబ్బు పంపితే ఆ ట్రాన్సాక్షన్ రూ. 2000 కంటే ఎక్కువ అయితే అప్పుడు కొంత ఫీజు ఉండొచ్చు. అయితే ఈ ఛార్జీలు కస్టమర్‌పై కాకుండా వ్యాపారులు లేదా పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లపై పడతాయి.
ప్రస్తుతం చాలా UPI ట్రాన్సాక్షన్లకు రోజుకు రూ. 1 లక్ష వరకు పరిమితి ఉంది. కొన్ని ప్రత్యేక కేటగిరీల్లో మాత్రం ఈ లిమిట్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి సేవల కోసం రూ. 5 లక్షల వరకు ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుంది. ఈ పరిమితి భద్రత కోసం మాత్రమే పెట్టారు. ఈ లిమిట్ దాటితే ఛార్జీలు పడతాయనే అర్థం కాదు.
55
UPI ఛార్జీలపై రూమర్లు ఎందుకు వస్తున్నాయి?
UPI చెల్లింపుల సమయంలో వ్యాపారులకు NPCI కొన్ని ఇంటర్‌చేంజ్ ఫీజులు విధిస్తుంది. కొంతమంది వ్యాపారులు ఈ విషయాన్ని తమ కస్టమర్లకు చెప్పడంతో, అది తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో వార్తలు వ్యాపించాయి. దీంతో రూ. 1000కి పైగా ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు వస్తాయనే రూమర్లు పెరిగాయి. మొత్తం యూపీఐ ద్వారా డబ్బు పంపితే వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. రూ. 1000 దాటితే ఫీజు పడుతుందన్న వార్తలు పూర్తిగా తప్పు. కొన్ని వాలెట్ లేదా వ్యాపారి ట్రాన్సాక్షన్లలో మాత్రమే ఫీజులు ఉండొచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్‌ను నమ్మకుండా ప్రభుత్వం, RBI, NPCI అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మడం మంచిది.