Today Gold Rate: బంగారం ఇప్పుడు కొంటున్నవారికి పండగే, రూ.లక్షకు దిగొస్తున్న పసిడి

Published : Mar 24, 2026, 10:43 AM IST

Today Gold Rate: బంగారం, వెండి...ఆందోళనకరంగా పతనమైపోతున్నాయి. 45 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. గతంలో ఆకాశాన్ని తాకిన ధరలు....ఓ స్థాయిలో తగ్గుతూ వస్తూ ఇప్పుడు పూర్తిగా కుప్పకూలిపోతున్నాయి. 

PREV
14
పసిడి ప్రియులకు ఇది గుడ్ టైం

పసిడి ప్రియులకు ఇది గుడ్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా గోల్డ్, సిల్వర్ ధరలు ఊహించని విధంగా పాతాళానికి పడిపోయాయి. రేటు తగ్గుతున్న క్రమంలో కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా తగ్గే పరిణామాలు కనిపిస్తున్నాయని చెపుతున్నారు. ఇప్పుడు కొనడం లాభదాయకమని అంటున్నారు. 

24
45 ఏళ్లలో తొలిసారి

45 ఏళ్లలో తొలిసారి ఈ స్థాయిలో బంగారం రేట్లు పడిపోవడంతో మార్కెట్లో గందరగోళం నెలకొంది. కానీ కొనుగోలుదారులు మాత్రం సంతోషంలో ఉన్నారు. 1980 మార్చి తర్వాత ఈ స్థాయిలో పతనం నమోదు కావడం ఇదే మొదటిసారి. అప్పుడు గోల్డ్ 24 శాతం, సిల్వర్ 41 శాతం పడిపోయాయి. బాండ్లకు డిమాండ్ పెరిగే క్రమంలో పసిడి రేటు తగ్గుతోంది.

34
రూ.1,40,350 వద్దకు చేరిన బంగారం

ఇవాళ కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.2,940 తగ్గి రూ.1,40,350 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల పసిడిపై రూ.2,700 క్షీణించి రూ.1,28,650 వద్దకు చేరింది. గత 10 రోజులుగా బంగారం, వెండి తగ్గడమే తప్ప ఎలాంటి పెరుగుదల లేదు. ఇది కొనుగోలుదారులకు ఊరట ఇస్తోంది. వెండి ఇప్పుడు రూ.2,40,000 వద్ద ఉంది. 

44
డాలర్ బలపడటమే ఇందుకు ప్రధాన కారణం

బంగారం, వెండి తగ్గడానికి రీజన్ ముందునుంచి చెప్పుకుంటున్న డాలర్. డాలర్ బలపడటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రాఫిట్ బుకింగ్, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గడం పసిడి పతనం దిశగా నెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే పసిడికి డిమాండ్ తగ్గి క్రాష్ అవుతున్నాయని అంటున్నారు. బంగారం రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి...నిపుణులను అడిగి తెలుసుకోవడం ఉత్తమం. 

Read more Photos on
click me!

Recommended Stories