టీవీఎస్ కంపెనీ నుంచి చాలా రకాల బెస్ట్ వెహికల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. వివిధ వర్గాల ప్రజలకు అవసరమైన వెహికల్స్ ని టీవీఎస్ అందించింది. మహిళలకు, యువతకు, ఫ్యామిలీ మెన్ కి, పెద్ద వాళ్లకు ఇలా రకరకాల కేటగిరీల్లో డిఫెరెంట్ మోడల్స్ తీసుకొచ్చింది.
ఇప్పుడు రిలీజ్ చేసిన స్కూటీ జెస్ట్ 110 స్కూటర్ మాత్రం సిటీలో తిరగడానికి బాగుంటుంది. తేలికైన, స్టైలిష్ డిజైన్ తో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ ఇది. మీరు స్టూడెంట్ అయినా, ఉద్యోగం చేసేవారైనా, సింపుల్‌గా రైడ్ చేయాలనుకుంటే ఈ స్కూటర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని డిజైన్, కంఫర్టబుల్ సీటు వల్ల జర్నీ చాలా సాఫీగా సాగుతుంది.