ముఖేష్ అంబానీకి చెందిన జియో సంస్థ తన వినియోగదారుల కోసం అతి తక్కువ ధరకే మరో సూపర్ ప్లాన్ ను తీసుకొచ్చింది. గతంలో ఒక్కసారిగా రీఛార్జ్ ధరలు పెంచడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ లోకి చాలా మంది మారిపోతుండటంతో తిరిగి వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో రీఛార్జ్ ధరలు తగ్గిస్తోంది. అందులో భాగంలో కేవలం రూ.75కే సూపర్ రీఛార్జ్ ఆఫర్ అందిస్తోంది.
జియోకు పోటీగా Vi, BSNL, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు కూడా చవకైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతున్నాయి. అయితే జియోకు వినియోగదారులు ఎక్కువగా ఉండటమే కాకుండా దేశవ్యాప్తంగా మూరుమూల గ్రామాలకు కూడా సిగ్నల్స్ అందే విధంగా స్ట్రాంగ్ వ్యవస్థ ఉంది. అందుకే జియో పోటీ కంపెనీల వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం తక్కువ టారిఫ్ ధరలను ప్రవేశ పెడుతున్నాయి.
జియో యాప్‌లో చాలా రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. వాటిలో రూ.75 కొత్త రీఛార్జ్ ప్లాన్ కస్టమర్లను ఆకర్షిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, మెసేజ్ సౌకర్యం పొందొచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 23 రోజులు.
కస్టమర్లు రోజుకు 100 ఎంబీ హైస్పీడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు కావాలంటే అదనంగా 200 ఎంబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. డేటా అయిపోయాక కూడా 64 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇంకా జియో టీవీ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ స్పెషల్ ఆఫర్ జియో ఫోన్ కస్టమర్లకు మాత్రమే. వేరే స్మార్ట్ ఫోన్ వినియోగించే జియో కస్టమర్లకు ఈ రీఛార్జ్ ప్లాన్ వర్తించదు. మీ దగ్గర జియో ఫోన్ ఉంటే వెంటనే ఈ తక్కువ అన్ లిమిటెడ్ కాల్స్ ప్లాన్ ని రీఛార్జ్ చేసుకొని జియో సేవలు అంతరాయం లేకుండా పొందండి.