Train Food: రైల్లో వెళ్లేప్పుడు స్విగ్గీ యాప్‌లో ఫుడ్ బుక్ చేసుకునే అవకాశం.. ఎలాగంటే.?

Published : Jul 09, 2026, 03:49 PM IST

Train Food: రైల్లో వెళ్లేప్పుడు ఆహారం తినాలంటే ఎక్కువ‌గా స్టేష‌న్‌లో దొరికే ఆహారంపైనే ఆధార‌ప‌డాలి. న‌చ్చిన ఆహారాన్ని స్విగ్గీలో బుక్ చేసుకోవడానికి అంద‌బాటులో ఉన్న.. ఫుడ్ ఆన్ ట్రైన్ ఫీచ‌ర్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
భారీగా పెరిగిన ఫుడ్ ఆర్డ‌ర్లు

రైల్లో ఫుడ్ ఆర్డ‌ర్ల‌కు సంబంధించి తాజాగా స్విగ్గీ ఓ రిపోర్టును విడుద‌ల చేసింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం 2026 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 'ఫుడ్ ఆన్ ట్రైన్' సేవకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ కాలంలో ఫుడ్ ఆర్డర్లు దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. వేసవి సెలవుల్లో ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణించడం వల్ల ఈ సేవ వినియోగం కూడా పెరిగింది. ఒకే PNRపై ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు రెండు లేదా అంతకంటే ఎక్కువ స్టేషన్లకు ముందుగానే ఆహారం బుక్ చేసుకోవడం కూడా గణనీయంగా పెరిగింది. అలాంటి ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 300 శాతం కంటే ఎక్కువ పెరిగాయని స్విగ్గీ వెల్లడించింది.

25
ప్రయాణికులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఇవే

రైలు ప్రయాణంలో ఎక్కువ మంది ఎంచుకున్న ఆహార పదార్థాల్లో రోటీ మొదటి స్థానంలో ఉంది. వేసవి కాలంలో మాత్రమే స్విగ్గీ ద్వారా 4 లక్షలకు పైగా రోటీలు ఆర్డర్ చేసినట్లు కంపెనీ తెలిపింది. అదే విధంగా ఎక్కువగా ఆర్డర్ చేసిన ఇతర ఆహార పదార్థాల్లో.. రోటీ, మసాలా దోసె, ఆలూ పరాఠా, మెక్ ఆలూ టిక్కీ బర్గర్, చికెన్ బిర్యానీ (నాన్-వెజ్ విభాగంలో అత్యధికంగా) ఉన్నాయి. ఈ జాబితా చూస్తే రైలు ప్రయాణంలో ఈజీగా తినగలిగే ఆహారానికే ప్రయాణికులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

35
వేసవిలో డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌కు భారీ డిమాండ్

ఎండాకాలంలో చల్లని పానీయాల ఆర్డర్లు కూడా భారీగా పెరిగాయి. సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్లు 354 శాతం పెరిగాయి. ఐస్‌క్రీమ్ ఆర్డర్లు 140 శాతం వృద్ధి చెందాయి. లస్సీ ఆర్డర్లు దాదాపు రెండు రెట్లు పెరిగాయి. సమ్మర్ డ్రింక్స్‌లో మ్యాంగో షేక్ అత్యంత ప్రజాదరణ పొందింది. శీతాకాలంతో పోలిస్తే దీని డిమాండ్ దాదాపు 10 రెట్లు పెరిగినట్లు స్విగ్గీ వెల్లడించింది.

45
మరిన్ని రైల్వే స్టేషన్లకు సేవల విస్తరణ

ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో స్విగ్గీ తన 'ఫుడ్ ఆన్ ట్రైన్' సేవను మరింత విస్తరించింది. ఇటీవల 17 కొత్త రైల్వే స్టేషన్లను ఈ సేవలో చేర్చారు. గురుగ్రామ్, ఉదయ్‌పూర్, బికనీర్, నాందేడ్, నిజామాబాద్ వంటి స్టేషన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సేవ దేశవ్యాప్తంగా 180కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంది. కొందరు ప్రయాణికులు తమ ప్రయాణానికి నాలుగు రోజుల ముందే ఆహారాన్ని బుక్ చేసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.

55
రైలులో ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలి?

స్విగ్గీ యాప్‌లో రైలులో భోజనం ఆర్డర్ చేయడం చాలా సులభం. యాప్‌లో ఉన్న 'Scan Your Ticket' ఫీచర్ ద్వారా రైల్వే టికెట్‌ను స్కాన్ చేస్తే, PNR నంబర్ ఆటోమేటిక్‌గా యాడ‌ఖ‌ అవుతుంది. అనంతరం అందుబాటులో ఉన్న స్టేషన్లు, రెస్టారెంట్ల నుంచి మీకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకుని ఆర్డర్ చేయవచ్చు. రైలు నిర్ణీత స్టేషన్‌కు చేరుకునే సమయానికి మీ భోజనం నేరుగా మీ సీటు వద్దకు డెలివరీ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories