UPI AI Payments: ఏఐతో యూపీఐ పేమెంట్స్.. ఎన్‌పీసీఐ సెన్సేషనల్ ఫీచర్

Published : Jul 09, 2026, 01:07 PM IST

UPI AI Payments: ఇకపై మొబైల్ తీయకుండానే ఏఐ సహాయంతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సరికొత్త 'యూనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్' (UAP) ఫీచర్‌ను తీసుకొస్తోంది.

PREV
15
కరెంట్ బిల్లుల నుంచి షాపింగ్ వరకు.. అంతా ఏఐ చూసుకుంటుంది.. యూపీఐ కొత్త ఫీచర్

మీరు యూపీఐ వాడుతున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. డిజిటల్ పేమెంట్స్ రంగంలో త్వరలోనే ఒక మైండ్ బ్లోయింగ్ ఛేంజ్ రాబోతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక సూపర్ టెక్నాలజీపై వర్క్ చేస్తోంది. దీని పేరు 'యూనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్' (UAP).

ఈ కొత్త సిస్టమ్ ద్వారా ఏజెంటిక్ ఏఐ బేస్డ్ అసిస్టెంట్లకు మీ యూపీఐ ద్వారా సేఫ్‌గా పేమెంట్స్ చేసే పర్మిషన్ దొరుకుతుంది. అంటే, ఇకపై మీరు ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేతిలోకి తీసుకోక్కర్లేదు. మీ ఏఐ ఏజెంటే మీ తరపున బిల్లులు కట్టడం, చిన్న చిన్న లావాదేవీలు చేయడం వంటి పనులన్నీ చిటికెలో పూర్తి చేసేస్తుంది.

25
ఏమిటీ కొత్త ప్రపోజల్? ఎలా పనిచేస్తుంది?

ఈ కొత్త ప్రోటోకాల్‌ను ఎన్‌పీసీఐ టెక్ ఇండస్ట్రీతో కలిసి రెడీ చేస్తోంది. అసలు ఈ ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటంటే.. ఇవి కేవలం మనం చెప్పిన ఆర్డర్స్ ఫాలో అవ్వడమే కాదు, మనం సెట్ చేసిన లిమిట్ లోపల స్వంతంగా డెసిషన్స్ తీసుకుని, మల్టిపుల్ స్టెప్స్ ఉన్న పనులను కూడా ఈజీగా ఫినిష్ చేయగలవు.

రిపోర్ట్స్ ప్రకారం.. యూజర్స్ ఇచ్చే పర్మిషన్, రూల్స్ బేస్ చేసుకుని ఈ ఏఐ ఏజెంట్లు యూపీఐ ట్రాన్సాక్షన్లు చేసేలా ఎన్‌పీసీఐ ఒక ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేస్తోంది. అయితే, ఫైనల్ కంట్రోల్, సెక్యూరిటీ అంతా పూర్తిగా యూజర్ల చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ ఈ ప్లాన్ సక్సెస్ అయితే, నేషనల్ లెవెల్‌లో ఏఐ ఏజెంట్ల ద్వారా డిజిటల్ పేమెంట్స్ ఫెసిలిటీ తెచ్చిన దేశాల లిస్ట్‌లో ఇండియా చేరిపోతుంది.

35
ఈ పనులన్నీ ఏఐ చూసుకుంటుంది..

కొత్త సిస్టమ్‌లో యూజర్ తన ఏఐ ఏజెంట్‌కు ముందే కొన్ని పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఆ లిమిట్ లోపల మాత్రమే ఏఐ పేమెంట్స్ చేస్తుంది.

• కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మొబైల్ రీఛార్జ్ చేయడం.

• ఆన్‌లైన్ షాపింగ్ పేమెంట్స్.

• ట్రావెల్ టికెట్ బుకింగ్స్.

• ఓటీటీ లేదా ఇతర సబ్‌స్క్రిప్షన్ల రెన్యూవల్.

• మీరు ఫిక్స్ చేసిన అమౌంట్ వరకు రెగ్యులర్ పేమెంట్స్.

రిపోర్టుల ప్రకారం.. ఈ ప్రోటోకాల్ బాధ్యతలను ఎన్‌పీసీఐ చూస్తోంది. టెక్ కంపెనీలు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ నుంచి సలహాలు తీసుకుంటున్నారు. ఈ సిస్టమ్ వాడాలంటే ముందుగా ఏఐ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ జరగాలి, ఆ తర్వాత వాటి వెరిఫికేషన్ పూర్తయ్యాకే పేమెంట్ పర్మిషన్ వస్తుంది.

45
సేఫ్టీ విషయంలో నో కాంప్రమైజ్

డబ్బుల విషయమంటే భయం ఉంటుంది కదా.. అందుకే సెక్యూరిటీపై ఎన్‌పీసీఐ ఫుల్ ఫోకస్ పెట్టింది.

• ప్రతి ఏఐ ఏజెంట్‌కు ఒక యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ ఉంటుంది.

• యూజర్ల స్పష్టమైన పర్మిషన్ తప్పనిసరి.

• పేమెంట్ చేయడానికి ఒక అమౌంట్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు.

• టైమ్ లిమిట్ బేస్డ్ పర్మిషన్లు ఉంటాయి.

• ప్రతి ట్రాన్సాక్షన్ పూర్తి ట్రాకింగ్, ఆడిట్ జరుగుతుంది.

దీనివల్ల ఈ-కామర్స్, ట్రావెల్ బుకింగ్, ఫుడ్ డెలివరీ, సబ్‌స్క్రిప్షన్ సర్వీసెస్, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ లాంటి రంగాలకు భారీగా హెల్ప్ అవుతుంది.

55
మొత్తం యూపీఐ సిస్టమ్ మారుతుందా?

టెక్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం.. ఏజెంటిక్ ఏఐ, యూపీఐ కాంబినేషన్ డిజిటల్ పేమెంట్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుంది. దీనివల్ల టైమ్ చాలా సేవ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఎన్‌పీసీఐ దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. ఒకవేళ దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తే, ఫ్యూచర్‌లో ఏఐ అసిస్టెంట్లు కేవలం సలహాలు ఇవ్వడమే కాదు, మీ పర్మిషన్‌తో యూపీఐ పేమెంట్స్ కూడా చేసేస్తాయి.

గుడ్ న్యూస్ ఏంటంటే.. దీనికోసం ప్రస్తుతం ఉన్న యూపీఐ సిస్టమ్‌లో ఎలాంటి పెద్ద మార్పులు చేయక్కర్లేదు. ఈ కొత్త ప్రోటోకాల్ పాత సిస్టమ్‌తో కలిసే పనిచేస్తుంది. కాబట్టి జనం ఎప్పటిలాగే నార్మల్ యూపీఐ వాడుకోవచ్చు, ఏఐ ఫీచర్ మాత్రం అదనంగా యాడ్ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories