Post Office Schemes: పోస్టాఫీసులో టాప్ 5 బెస్ట్ స్కీమ్స్ ఇవే.. మీ డబ్బులు డబుల్!

Published : Oct 21, 2026, 09:45 AM IST

Post Office Schemes: కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా దాచుకోవడంతో పాటు, భవిష్యత్ అవసరాల కోసం మంచి రాబడి ఆశించేవారికి పోస్టాఫీసు స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్. అలాంటి టాప్ 5 పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

PREV
15
టాప్ 5 బెస్ట్ పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్

డబ్బు దాచుకోవడానికి బ్యాంకులనే కాదు, పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌ను కూడా మనం వాడుకోవచ్చు. ఒక్కో స్కీమ్ ఒక్కో అవసరానికి తగ్గట్టుగా ఉంటుంది. కొన్ని దీర్ఘకాలిక పొదుపునకు పనికొస్తే, మరికొన్ని క్రమం తప్పకుండా ఆదాయాన్ని ఇస్తాయి. ఇవి ప్రభుత్వ పథకాలు కాబట్టి మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం ఉండదు. అయితే పెట్టుబడి కాలం, డబ్బులు ముందుగా తీసుకునే రూల్స్, ట్యాక్స్ వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. మరి పోస్టాఫీసులో టాప్ 5 బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఏంటి? ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి ఎంత శాతం వడ్డీ వస్తుంది వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

25
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

లాంగ్ టర్మ్ సేవింగ్స్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని కాలపరిమితి 15 ఏళ్లు. ఏడాదికి కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు కట్టొచ్చు. ప్రస్తుతం దీనిపై 7.1% వడ్డీ వస్తోంది. అవసరాన్ని బట్టి లోన్ తీసుకోవడం, కొంత డబ్బు వెనక్కి తీసుకునే సదుపాయం కూడా ఉంది.

కిసాన్ వికాస్ పత్ర (KVP)

ఈ స్కీమ్ లో పెట్టిన పెట్టుబడి నిర్ణీత కాలంలో రెట్టింపు అవుతుంది. అక్టోబర్-డిసెంబర్ 2026 వడ్డీ రేట్ల ప్రకారం, 115 నెలల్లో (9 ఏళ్ల 7 నెలలు) డబ్బు డబుల్ అవుతుంది. కనీసం రూ.1,000 తో చేరొచ్చు, గరిష్ట పరిమితి లేదు. కానీ వచ్చే వడ్డీపై ట్యాక్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం PPF, ఫిక్స్‌డ్ టైమ్‌కి డబ్బు దాచుకోవడానికి KVP మంచి ఆప్షన్స్.

35
సుకన్య సమృద్ధి యోజన (SSY)

పదేళ్ల లోపు ఉన్న ఆడపిల్ల పేరు మీద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ అకౌంట్ తెరవవచ్చు. ఏడాదికి కనీసం రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం దీనికి 8.2% వడ్డీ ఇస్తున్నారు. అకౌంట్ తెరిచిన 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. కానీ మొదటి 15 ఏళ్లు మాత్రమే డబ్బులు కట్టాలి. ఉన్నత చదువుల కోసం మధ్యలో కొంత డబ్బు తీసుకునే వీలుంది.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)

ఒకేసారి డబ్బులు కట్టి, ఐదేళ్ల పాటు ప్రతి నెలా వడ్డీ పొందాలనుకునేవారికి ఇది బాగా సెట్ అవుతుంది. సింగిల్ అకౌంట్‌పై రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్‌పై రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. 7.4% వడ్డీతో, జాయింట్ అకౌంట్‌లో రూ.15 లక్షలు పెడితే నెలకు సుమారు రూ.9,250 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ తర్వాత అసలు డబ్బు వెనక్కి ఇచ్చేస్తారు.

45
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

60 ఏళ్లు నిండిన వారు ఇందులో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నిబంధనల ప్రకారం కొందరు రిటైర్డ్ ఉద్యోగులకు ముందే అవకాశం ఉంటుంది. ఇందులో గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. దీని కాలపరిమితి ఐదేళ్లు. ప్రస్తుతం 8.2% వడ్డీ ఇస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే, 8.2% వడ్డీ చొప్పున మూడు నెలలకు సుమారు రూ.61,500 వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునేవారికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. అయితే వచ్చే వడ్డీపై ట్యాక్స్ పడే అవకాశం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి.

55
ఎవరికి ఏ స్కీమ్ బెస్ట్?

లాంగ్ టర్మ్ సేవింగ్స్ కావాలనుకునేవారు పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. ఆడపిల్ల చదువు, భవిష్యత్తు కోసం దాచుకోవాలనుకుంటే సుకన్య సమృద్ధి బెస్ట్. ప్రతి నెలా వడ్డీ ఆదాయం కావాలనుకునేవారు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, రిటైర్మెంట్ తర్వాత మూడు నెలలకోసారి ఆదాయం కోసం సీనియర్ సిటిజన్ స్కీమ్ పరిశీలించొచ్చు. ఒక నిర్ణీత కాలానికి డబ్బు ఫిక్స్ చేయాలనుకుంటే కిసాన్ వికాస్ పత్ర ఎంచుకోవచ్చు. ఈ ఐదు స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు మీ వయసు, అవసరం, సమయం, ట్యాక్స్ రూల్స్ బేరీజు వేసుకొని సరైన స్కీమ్ ఎంచుకుంటే పొదుపు ప్రయోజనం పూర్తిగా దక్కుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories