EPFO: ఈపీఎఫ్ఓ బంపర్ ఆఫర్.. వాట్సాప్‌లోనే పీఎఫ్, పెన్షన్ అప్‌డేట్స్.. ఎలా చూడాలంటే?

Published : Oct 20, 2026, 04:09 PM IST

EPFO: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈపీఎఫ్ఓ వాట్సాప్‌లో అధికారిక ఛానెల్‌ను ప్రారంభించింది. పీఎఫ్, పెన్షన్, ఈడీఎల్ఐ పథకాల అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లోనే ఉచితంగా పొందవచ్చు. పూర్తి వివరాలు మీకోసం.

PREV
16
వాట్సాప్‌లో EPFO ఛానెల్ వచ్చేసింది

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ఒక సరికొత్త డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగులకు తమ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి కీలకమైన సేవలపై స్పష్టతనివ్వడానికి ఒక అధికారిక వాట్సాప్ ఛానెల్‌ను సంస్థ ప్రారంభించింది. ఈ ఛానెల్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్‌లోనే పీఎఫ్ వివరాలను చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ కొత్త సేవ ద్వారా సబ్‌స్క్రైబర్లు వాట్సాప్‌లోనే ముఖ్యమైన నోటిఫికేషన్లు, గడువు తేదీలు, పీఎఫ్ నిబంధనల మార్పులు, కొత్త పథకాల వివరాలను క్లియర్ గా పొందవచ్చు. అందు అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ఛానెల్‌ను అనుసరించే వారి సంఖ్య 2 లక్షల మార్కును దాటడం విశేషం.

26
వాట్సాప్ ఛానెల్‌లో లభించే ప్రధాన సేవలు ఇవే

ఈపీఎఫ్ఓ తన అధికారిక వాట్సాప్ ఛానెల్ లో ప్రధానంగా మూడు ముఖ్యమైన పథకలాకు సంబంధించిన అప్‌డేట్లను అందిస్తోంది..

• ఈపీఎఫ్ (EPF - ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్): ప్రతినెల ఖాతాలో పడే పీఎఫ్ కంట్రిబ్యూషన్, అత్యవసర సమయాల్లో ఖాతా నుంచి విత్‌డ్రా లేదా అడ్వాన్స్ డబ్బులు తీసుకునే పద్ధతి, ఇతర విషయాలపై నోటిఫికేషన్లు ఉంటాయి.

• ఈపీఎస్ (EPS - ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్): ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పెన్షన్‌కు సంబంధించిన రూల్స్, కొత్త నోటిఫికేషన్ల సమాచారం ఇస్తారు.

• ఈడీఎల్ఐ (EDLI - ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్): ఉద్యోగులకు వర్తించే ఉచిత ఇన్సూరెన్స్ లైఫ్ కవర్, దానికి సంబంధించి క్లెయిమ్ ప్రక్రియల సమాచారాన్ని ఇక్కడ షేర్ చేస్తారు.

ఈ మూడింటితో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిర్వహించే గ్రీవెన్స్ క్యాంపులు, ముఖ్యమైన తేదీల అప్‌డేట్లు కూడా ఎప్పటికప్పుడు మెసేజ్‌ల ద్వారా అందుతాయి.

36
పిఎఫ్ విత్‌డ్రా, రూల్స్ తెలుసుకునేందుకు ఈజీ వీడియోలు

సాధారణంగా పీఎఫ్ రూల్స్ అర్థం కాక చాలామంది గూగుల్ లో వెతుకుతుంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ వాట్సాప్ ఛానెల్‌లో సమాచారంతో పాటు ప్రాసెస్ అర్థమయ్యేలా వీడియోలు, ట్యూటోరియల్స్ పోస్ట్ చేస్తున్నారు.

పీఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్ డబ్బులు ఎలా విత్‌డ్రా చేయాలి, ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు కంట్రిబ్యూషన్ రూల్స్ ఎలా మారతాయి అనే అంశాలతో పాటు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియో లింక్‌ల ద్వారా అందిస్తున్నారు. దీనివల్ల కాంప్లికేటెడ్ రూల్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి.

46
వాట్సాప్ ద్వారా నేరుగా పిఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయవచ్చా?

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని సబ్‌స్క్రైబర్లు గుర్తుంచుకోవాలి. ఈపీఎఫ్ఓ వాట్సాప్ ఛానెల్ అనేది కేవలం ఉద్యోగుల్లో అవగాహన పెంచడానికి, అప్‌డేట్స్ ఇవ్వడానికి మాత్రమే రూపొందించారు.

వాట్సాప్ ద్వారా నేరుగా మీ పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం, క్లెయిమ్ ఫారాలు సబ్మిట్ చేయడం లేదా అడ్వాన్స్ డబ్బుల కోసం దరఖాస్తు చేయడం కుదరదు. వీటి కోసం సభ్యులు ఎప్పటిలాగే ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ పోర్టల్, ఉమాంగ్ మొబైల్ యాప్ లేదా తమ సమీపంలోని రీజినల్ పిఎఫ్ ఆఫీస్‌ను మాత్రమే సంప్రదించాల్సి ఉంటుంది.

56
మీ మొబైల్‌లో ఈపీఎఫ్ఓ వాట్సాప్ ఛానెల్ జాయిన్ అవ్వడం ఎలా?

మీ వాట్సాప్‌లో ఈపీఎఫ్ఓ ఛానెల్‌ని ఫాలో అవ్వడం చాలా సింపుల్. క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి..

1. మీ మొబైల్‌లో ముందుగా WhatsApp యాప్ ఓపెన్ చేయండి.

2. యాప్ కింద లేదా పైన కనిపించే Updates విభాగంలోకి వెళ్లండి.

3. అక్కడ ఉండే Channels కింద Explore ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

4. పైన సెర్చ్ బార్‌లో EPFO అని టైప్ చేయండి.

5. EPFO అధికారిక ఛానెల్‌ని గుర్తుపట్టి పక్కనే ఉన్న Follow బటన్‌పై క్లిక్ చేయండి.

దీంతో సంస్థ షేర్ చేసే ప్రతీ సమాచారం మీకు నేరుగా వాట్సాప్‌లోనే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది.

66
కంపెనీలు, యాజమాన్యాలకు ఈపీఎఫ్ఓ ఇచ్చిన సడలింపులు

మరోవైపు వ్యాపార సంస్థలు, కంపెనీలకు కూడా ఈపీఎఫ్ఓ ఒక కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 2026కి సంబంధించిన ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ECR) సమర్పించే చివరి తేదీని గతంలో ఉన్న అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 31, 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వేతన పరిమితుల్లో మార్పులు జరిగినందున, కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలు, పీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్ కంట్రిబ్యూషన్ వివరాలను సరిగ్గా నమోదు చేయడానికి అదనపు సమయం అవసరం అని గ్రహించి ఈపీఎఫ్ఓ ఈ మినహాయింపు ఇచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories