పారిస్, ఫ్రాన్స్
ప్రపంచంలోని టాప్ 10 నగరాల్లో ముఖ్యమైనది పారిస్. ఇక్కడున్న ఎఫిల్ టవర్, లౌవర్ వంటి ప్రదేశాలు చూడటానికి దేశదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. పారిస్ దాని ఆర్కిటెక్చర్, రొమాంటిక్ వాతావరణం వల్ల ఫేమస్ అయ్యింది.
న్యూయార్క్ నగరం, యూఎస్ఏ
అందమైన నగరాల్లో న్యూయార్క్ నగరం కూడా ఒకటి. అమెరికాలో అతిపెద్ద, ముఖ్యమైన నగరం ఇది. అమెరికాలోని ఈశాన్య భాగంలో ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ఉంది.
లండన్, యునైటెడ్ కింగ్‌డమ్
లండన్ ఒక అద్భుతమైన నగరం. ఇక్కడి ఆర్కిటెక్చర్ చాలా ప్రత్యేకమైనది. ఈ నగరంలో పార్కులు, టవర్ ఆఫ్ లండన్, బకింగ్‌హామ్ ప్యాలెస్ వంటి ప్రదేశాలు చూడటానికి రెండు కళ్లు చాలవు.
వెనిస్, ఇటలీ
వెనిస్ ఒక అందమైన నగరం. ఎందుకంటే ఇక్కడ కాలువలు కూడా చాలా క్లీన్ గా, అందంగా ఉంటాయి. ఇక్కడ కనిపించే ఆర్కిటెక్చర్ చక్కటి రొమాంటిక్ ఫీల్ ని ఇస్తుంది. దానికోసమే ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు.
వాంకోవర్, కెనడా
వాంకోవర్ నగరంలో ఉన్న పర్వతాలు, బీచ్‌లు చాలా బాగుంటాయి. ఈ నగరంలో లైఫ్‌స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ అనుభవించడానికే పర్యాటకులు ఎక్కువ ఈ నగరాన్ని విజిట్ చేస్తుంటారు.
కేప్‌టౌన్, సౌత్ ఆఫ్రికా
ఈ నగరం ప్రాచీన సంస్కృతికి ఫేమస్. ఇక్కడ టేబుల్ మౌంటెన్, అందమైన సముద్ర తీరాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి.
బార్సిలోనా, స్పెయిన్
స్పెయిన్ దేశానికి ఈశాన్య తీరంలో బార్సిలోనా నగరం ఉంది. ఇది స్పెయిన్‌లోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన నగరం. నైరుతి ఐరోపాలో బార్సిలోనా ఒక సాంస్కృతిక, ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా పేరు పొందింది.
శాన్ ఫ్రాన్సిస్కో, యూఎస్ఏ
శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడటం చాలామందికి ఒక లక్ష్యం. ఈ పట్టణంలో 50 కొండలు ఉన్నాయి. ఈ కొండలను అందమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇవికాక పర్యాటక కేంద్రాలైన అనేక దీవులు కూడా ఉన్నాయి.
సిడ్నీ, ఆస్ట్రేలియా
సిడ్నీలో తప్పకుండా చూడాల్సినవి ఒపెరా హౌస్, షిపింగ్ హార్బర్. ఇక్కడున్న అందమైన ఓడరేవు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. ఇది అర్బన్ నేచర్ లవర్స్‌కి బెస్ట్ ప్లేస్.
రోమ్, ఇటలీ
రోమ్ కొలోసియం, వాటికన్ సిటీ వంటి పురాతన కట్టడాలు కలిగిన నగరం రోమ్. ఈ నగర చరిత్ర చాలా పురాతమైనది. ఈ నగర ఆర్కిటెక్చర్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు.
నోట్: ఇండియాలో 5000 ఏళ్ల క్రితం నిర్మించిన వారణాసి నగరం లాంటి పురాతన నగరాలు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాయి కాని.. టాప్ 10 లో అందమైన నగరం లేదు. జైపూర్, మైసూర్, వంటి నగరాలు టాప్ 100 లిస్టులో ఉన్నాయి.