Car: రూ. 68 వేలు డౌన్‌పేమెంట్, నెల‌కు రూ. 10 వేలు EMI క‌డితే చాలు.. ఈ కారు మీ సొంతం

Published : Jun 19, 2025, 03:21 PM IST

సొంత కారు కొనుగోలు చేయాల‌ని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే ఖ‌రీదైన విష‌యం కావ‌డంతో వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ బ్యాంకులు రుణాలు ఇస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో త‌క్కువ ఈఎమ్ఐతో కారును సొంతం చేసుకునే అవ‌కాశం ఉంది. 

PREV
16
టాటా పంచ్ కారు

2024లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన SUVగా టాటా పంచ్ నిలిచింది. ఇందులోని సేఫ్టీ ఫీచ‌ర్లు, ధ‌ర ఈ కారుకు ఆద‌ర‌ణ ల‌భించ‌డానికి కార‌ణాలు చెప్పొచ్చు. Global NCAP నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో పంచ్‌కు 5 స్టార్ రేటింగ్ లభించింది. ఇది భారతీయ వినియోగదారులలో గట్టి నమ్మకాన్ని ఏర్పరిచింది.

26
ధ‌రకు సంబంధించిన వివ‌రాలు

టాటా పంచ్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ వేరియంట్ ధ‌ర రూ. 6 ల‌క్ష‌లుగా ఉంది. కాగా గ‌రిష్ట ధ‌ర రూ. 10.32 ల‌క్ష‌లుగా ఉంది. ఈ కారును మొత్తం 5 క‌ల‌ర్ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు.

36
లోన్‌పై ఎలా తీసుకోవాలి.?

టాటా పంచ్ ప్యూర్ MT (బేస్ మోడల్) ఆన్-రోడ్ ధర సుమారు రూ. 6,88,250 ఉంటుంది. మీరు ఈ కారును లోన్‌పై కొనాలంటే బ్యాంక్ నుంచి రూ. 6.2 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఇందుకోసం మీరు చెల్లించాల్సిన డౌన్ పేమెంట్ సుమారు రూ. 68,000.

46
ఎంత ఈఎమ్ఐ చెల్లించాలి.?

ఉదాహ‌ర‌ణ‌కు మీకు కార్ లోన్ 9 శాతం వ‌డ్డీకి ల‌భించింద‌ని అనుకుందాం. ఒక‌వేళ మీరు 7 ఏళ్ల కాల వ్య‌వ‌ధికి లోన్ తీసుకుంటే నెల‌కు రూ. 10 వేలు ఈఎమ్ఐ చెల్లించ‌వ‌చ్చు. ఆరు సంవ‌త్స‌రాల‌కు అయితే రూ. 11,200, 5 సంవ‌త్స‌రాల‌కు అయితే రూ. 12,900, 4 సంవ‌త్స‌రాల‌కు సుమారు రూ. 16 వేల ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది

56
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.?

ఈ కారులో 7 ఇంచెస్‌తో కూడిన సెమి-డిజిటల్ క్లస్టర్ స్క్రీన్‌ను అందించారు. ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ (AC), క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, వర్షాన్ని గుర్తించి స్వయంగా పనిచేసే వైపర్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్ వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు.

66
సేఫ్టీ ప‌రంగా చూస్తే..

భ‌ద్ర‌తా ప‌రంగా చెప్పాలంటే ఈ కారు ముందు రెండు ఎయిర్‌బ్యాగ్స్ ఇచ్చారు. అలాగే ABS, EBD సిస్టమ్‌ను ఇచ్చారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు. మైలేజ్ విష‌యానికొస్తే.. లీట‌ర్‌కు 18 కిలోమీట‌ర్లు ఇస్తుంద‌ని కంపెనీ చెబుతోంది. ఇక ఈ కారులో 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజ‌న్‌ను ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories