ఆహా.. ఇకపై మీ ఊర్లో కూడా ఫుల్ ఇంటర్నెట్: స్టార్‌లింక్‌కు అనుమతిచ్చిన భారత ప్రభుత్వం

Published : May 09, 2025, 01:57 PM IST

Starlink: దేశంలో టెలికాం సేవల్లో కీలక పరిమాణం ఇది. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు వేగంగా అందనున్నాయి. దీనికోసం ఎలాన్ మస్క్ సంస్థ అయిన స్టార్ లింక్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ పరిణామంతో జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ తదితర టెలికాం కంపెనీలు ఇరకాటంలో పడ్డాయి. ఏదిఏమైనా ఇకపై ప్రజలకు పోటాపోటీగా ఇంటర్నెట్ సేవలు అందుతాయన్న మాట. 

PREV
15
ఆహా.. ఇకపై మీ ఊర్లో కూడా ఫుల్ ఇంటర్నెట్:  స్టార్‌లింక్‌కు అనుమతిచ్చిన భారత ప్రభుత్వం

ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ నిర్వహించే స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు భారత ప్రభుత్వం కీలక ముందస్తు అనుమతి (Letter of Intent - LoI) జారీ చేసింది. ఈ అనుమతి ద్వారా స్టార్‌లింక్ దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి అవసరమైన తదుపరి అనుమతులను పొందడానికి మార్గం సుగమమైంది.

25

అంగీకారం తెలిపిన కేంద్ర ప్రభుత్వం

స్టార్‌లింక్ 2022లో గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (GMPCS) లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. అయితే జాతీయ భద్రతా కారణాలతో అనుమతులు ఆలస్యమయ్యాయి. తాజాగా ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను స్టార్‌లింక్ అంగీకరించడంతో టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ LoI జారీ చేసింది.

 

35

పల్లెల్లో ఇంటర్నెట్ సేవలు పెంచడానికే...

భారతదేశంలో స్టార్‌లింక్ సేవల ప్రారంభించాలనుకోవడానికి ముఖ్య కారణం.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు లిమిటెడ్ గా ఉన్నాయి. కొన్ని ఇంటర్నెట్ సేవలు అసలు మారుమూల ప్రాంతాలకు అందవు. అందుకే స్టార్‌లింక్ శాటిలైట్ ఆధారిత సేవలు, అలాంటి మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన, నమ్మకమైన ఇంటర్నెట్‌ను అందించడానికి సహాయపడతాయి.

 

45

జియో, ఎయిర్‌టెల్ తో ఒప్పందం..

ఈ సంవత్సరం మార్చిలో స్టార్‌లింక్ భారతదేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా స్టార్‌లింక్ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించడానికి సహకారం అందించనున్నారు. జియో, స్టార్‌లింక్ సేవలను తమ స్టోర్ల ద్వారా అందించనున్నట్లు ఇతర టెలికాం సంస్థలు ప్రకటించాయి.

 

55

పోటీ వల్ల మెరుగైన సేవలు అందుతాయి

స్టార్‌లింక్ సేవలు ప్రారంభమైతే భారతదేశంలోని బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో కొత్త పోటీకి దారితీయనుంది. ఇది వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో సహాయపడుతుంది. అయితే తుది లైసెన్స్ పొందడానికి స్టార్‌లింక్ అన్ని లైసెన్స్ నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

 

Read more Photos on
click me!

Recommended Stories