రిలయన్స్ ఇండస్ట్రీస్ పలు రంగాల్లో విస్తృతంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాలతో ఈ సంస్థకు మరింత ప్రాధాన్యం దక్కనుంది. ట్రేడ్మార్క్ జాబితాలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పలు విభాగాల్లో ఈ పేరును రిజిస్టర్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్, రిటైల్, గ్రాఫిక్స్, స్క్రీన్ కమ్యూనికేషన్, అల్గోరిథమిక్ కోడింగ్ వంటి విభాగాల్లో ఈ పేరు ఉపయోగించడానికి దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది.