ఓవైపు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజు కీ ఈ బంగారం ధర పెరుగుతుందే తప్ప, తరగడం లేదు. మధ్యతరగతి కుటుంబీకులు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. అలాంటివారికి ప్రస్తుతం ఉన్న ఆప్షన్ వెండి. కానీ, 2025లో వెండి ధర కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పారిశ్రామిక అవసరాలు పెరగడం, సరఫరాలో లోటు ఉండటం దీనికి ప్రధాన కారణాలు. దీంతో, ఈ సంవత్సరం వెండి మీద పెట్టుబడి పెడితే మనకు లాభం కలుగుతుందా? లేక నష్టం కలుగుతుందా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
25
వెండి ధర ఎందుకు పెరుగుతోంది?
2024లో 200 మిలియన్ ఔన్సుల వెండి సరఫరా లోటు కనిపించింది. అదే ధోరణి 2025లో కొనసాగుతోంది. ఇక వెండి ధర సైతం ఔన్సుకు
$35–$50 వరకు పెంచే అవకాశముందని మార్కెట్ నిపుణుల అభిప్రాయపడుతున్నారు, ప్రస్తుతం బంగారం-వెండి నిష్పత్తి 100:1గా ఉంది. ఇది భవిష్యత్తులో 70:1కి చేరితే, వెండి విలువ మరింతగా పెరుగుతుంది.
పారిశ్రామిక డిమాండ్ అధికం
వెండి డిమాండ్‌లో 55% భాగం సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, 5G టెక్నాలజీ, వైద్య పరికరాల్లో ఉంది. సౌరశక్తి ఉత్పత్తిలో 2024లో 20% వెండిని వాడారు. ఈ వాడకం 2025లో ఇంకా పెరుగుతుందని అంచనా. ఈ గ్రీన్ ఎనర్జీ దిశలో వెండి కీలక పాత్ర పోషించనుంది.
35
వెండి పెట్టుబడి ఎందులో పెట్టడం ఉత్తమం..?
1. భౌతిక వెండి: నాణేలు, కడ్డీలు, ఆభరణాల రూపంలో కొనొచ్చు. కానీ నిల్వ, బీమా ఖర్చులు పరిగణించాలి.
2. సిల్వర్ ETFలు: స్టాక్ మార్కెట్ ద్వారా వెండిలో పెట్టుబడి పెట్టడం సురక్షిత మార్గం. 2024లో సిల్వర్ ETFలు సగటున 16.63% రాబడి ఇచ్చాయి.
3. డిజిటల్ వెండి: Paytm, PhonePe లాంటి యాప్‌ల ద్వారా రూ.100 నుంచి కూడా వెండిని కొనొచ్చు. ఇది యువ పెట్టుబడిదారులకు అనుకూలం.
4. మైనింగ్ కంపెనీలు/మ్యూచువల్ ఫండ్స్: వెండి సంబంధిత కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా లాభాలు పొందొచ్చు. కానీ స్టాక్ మార్కెట్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
వెండి ధర భవిష్యత్తులో బంగారం కన్నా ఎక్కువగా మారిపోవచ్చు – కానీ అదే సమయంలో అత్యధిక అస్థిరత కలిగి ఉంటుంది. 2023లో వెండి ధర 15% పెరిగి, తరువాత 10% పడిపోయింది. అంటే ఇది తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఇచ్చే సామర్థ్యం కలిగిన పెట్టుబడి అయినప్పటికీ, అంతే సమానంగా నష్టాలు కూడా తెచ్చే అవకాశం ఉంది.
పెట్టుబడి టిప్స్
మొత్తం డబ్బును వెండిలో పెట్టొద్దు. 70% బంగారం – 30% వెండి నిష్పత్తి బాగా పనిచేస్తుంది.
ధర $30–$35 మధ్య ఉండగా కొనుగోలు చేయడం మంచిది.
సిల్వర్ ETFలు లేదా డిజిటల్ వెండి చిన్న పెట్టుబడిదారులకు ఉత్తమ ఎంపిక. ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
55
ఫైనల్ గా...
వెండిలో పెట్టుబడి 2025లో బాగా లాభదాయకంగా మారే అవకాశముంది. అయితే, ఇది చాలా అస్థిరంగా ఉండే పెట్టుబడి కావడంతో, జాగ్రత్తగా, సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవాలి. సరైన సమయానికి కొనుగోలు చేస్తే, మీ పెట్టుబడి "జాక్‌పాట్" కొట్టే అవకాశముంది. కానీ, పరిగణనలోకి తీసుకోవలసిన ప్రమాదాలను మాత్రం మరచిపోవద్దు!