Train Tickets Booking: చివరి క్షణంలోనూ రైల్వే టికెట్ కన్ఫర్మ్ ! స్మార్ట్ ట్రిక్స్ ఇవే!

Published : Jul 19, 2025, 11:38 AM IST

Train Tickets Booking: అర్జెంట్ గా రైలులో ప్రయాణించాల్సి వస్తే ? దానికీ IRCTC ఓ చక్కటి అవకాశం కల్పిస్తున్నది. రైలు బయల్దేరడానికి కొద్ది నిమిషాల ముందు కూడా కన్ఫర్మ్ టికెట్ పొందే సౌకర్యాన్ని అందిస్తున్నది. ఇంతకీ ఈ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?

PREV
16
చివరి క్షణంలోనూ టికెట్ కన్ఫర్మ్

రైలు ప్రయాణం చాలా మందికి ఇష్టమే. అయితే..అకస్మాత్తుగా టికెట్ బుక్ చేయాల్సిన పరిస్థితుల్లో టికెట్ దొరకడం కష్టంగా మారవచ్చు. అయితే కొన్ని  చిట్కాలు పాటిస్తే, కుటుంబంతో కలసి ఎంజాయ్ చేస్తూ రైళ్లో ప్రయాణం చేయవచ్చు. ఆ స్మార్ట్ చిట్కాలేంటో ఓ లూక్కేయండి. 

26
తత్కాల్ టికెట్ బుకింగ్ వేగంగా చేయాలంటే

తత్కాల్ టికెట్ బుకింగ్ వేగంగా చేయాలంటే మాస్టర్ లిస్ట్ ఉపయోగించండి. తత్కాల్ బుకింగ్ సమయంలో ప్రయాణీకుల పేరు, వయస్సు, లింగం, బెర్త్ తదితర వివరాలు ఎంటర్ చేయడానికి సమయం పడుతుంది. ఈ ఆలస్యం వల్ల టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకోసం IRCTC యాప్ ఉపయోగించండి. ఇందులో మన వివరాలు ముందుగానే ఉన్నాయి. కాబట్టి టైం వెస్ట్ కాదు. వేగంగా టికెట్ బుక్ చేయవచ్చు. 

36
ఇలా ప్రయత్నించండి

తత్కాల్ బుకింగ్ సమయంలో అనేకమంది ఒకేసారి ప్రయత్నించడంతో టికెట్ బుక్ చేయడం చాలా పోటీగా ఉంటుంది. అందుకే వేగంగా, సజావుగా వ్యవహరించటం చాలా ముఖ్యం. ముందుగా IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయి ఉంచండి. మీ ఖాతా ఆధార్‌తో లింక్ అయిందో లేదో ముందే నిర్ధారించుకోండి. వేగవంతమైన Wi-Fi లేదా 4G/5G ఇంటర్నెట్ కనెక్షన్ వాడటం ఉత్తమం.

మాస్టర్ లిస్ట్‌లో ప్రయాణీకుల వివరాలు (పేరు, వయస్సు, లింగం, ఐడి) ముందే నమోదు చేసి ఉంచడం వల్ల బుకింగ్ సమయంలో ఒక్క క్లిక్‌తో ఎంపిక చేసుకోవచ్చు. అలాగే..డబ్బులు చెల్లింపులకు UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వివరాలు సిద్ధంగా ఉంచండి. పేమెంట్ సమయంలో ఆలస్యం అయితే టికెట్ కన్ఫర్మ్ కాకపోవచ్చు.

అదనంగా.. ఒక రైలులో టికెట్ దొరకకపోతే, అదే మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్లల్లో ట్రై చేయండి. అలాగే మహిళలకు ప్రత్యేక కోటా (Ladies Quota) ఉంటుంది. ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఈ కోటాలో ప్రయత్నిస్తే.. సులభంగా టికెట్ పొందవచ్చు. 

46
తత్కాల్ బుకింగ్ సమయం, ప్రీమియం ఎంపిక

తత్కాల్ బుకింగ్ సమయంలో సరైన సమయానికి ప్రయత్నించడం చాలా కీలకం. AC క్లాస్‌కు ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్‌కు ఉదయం 11 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. ఒక నిమిషం ఆలస్యం అయినా టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రీ ప్లాన్డ్ గా ఉండండి. 

అత్యవసర పరిస్థితుల్లో టికెట్ దొరకలేదంటే ‘ప్రీమియం తత్కాల్’ బుకింగ్‌ని ప్రయత్నించండి. ఇందులో టికెట్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అయితే ఛార్జీలు కొంత ఎక్కువగా ఉంటాయి.

భీమా ఎంపికను తప్పక ఎంచుకోండి. IRCTC అందించే ప్రయాణ భీమా సర్వీసు తక్కువ ఖర్చుతో (ఒక్కో టికెట్‌కు పైసల్లో) రూ.10 లక్షల వరకు బీమా కవరేజ్ కల్పిస్తుంది. ఇది ప్రమాదకాలంలో ప్రయాణికులకు చాలా ఉపయోగపడుతుంది. 

56
వెయిటింగ్ టికెట్?

వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నా నిరాశ పడొద్దు. ‘ఆటో అప్‌గ్రేడేషన్’ ఎంపికను టికెట్ బుకింగ్ సమయంలో ఎంచుకుంటే..  రైలులో ఖాళీ సీట్లు ఉంటే అదనపు ఖర్చు లేకుండా కన్ఫర్మ్ టికెట్ లభించే అవకాశం ఉంటుంది. 

రైల్లో ప్రయాణించేటప్పుడు ‘RailYatri’ లేదా ‘Rail One’ వంటి యాప్స్ ద్వారా టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, లైవ్ స్టేటస్ వంటివి తెలుసుకోవచ్చు. ప్రయాణ సమయంలో వీటిని ఉపయోగించడం మన ప్రయాణం మరింత సౌకర్యంగా మారుతుంది.  

టికెట్ రద్దు: ఛార్జీలు

బుక్ చేసిన టికెట్‌ను 48 గంటల ముందు రద్దు చేస్తే.. AC ఫస్ట్ క్లాస్‌కి – ₹240, స్లీపర్ క్లాస్‌కి – ₹120, సెకండ్ క్లాస్‌కి – ₹60 లు ఛార్జీ చేస్తారు.

12 గంటల ముందు రద్దు చేస్తే – టికెట్ ధరలో 25% కోత,  4 గంటల ముందు రద్దు చేస్తే – 50% కోత విధిస్తారు. ఇక తత్కాల్ కన్ఫర్మ్ టికెట్‌కు రీఫండ్ ఉండదు. వెయిటింగ్ టికెట్‌కి పై నిబంధనల ప్రకారం రీఫండ్ లభిస్తుంది. 

66
తత్కాల్ టికెట్ బుక్ చేయండిలా?

తత్కాల్ టికెట్ బుకింగ్ త్వ‌ర‌గా చేయాలంటే ఈ అంశాలు గుర్తుంచుకోండి:

 ఆధార్ లింక్ చేయడం ఎలా?

  • మీ IRCTC ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి.
  • ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అవ్వండి.
  • My Account > Verify User అనే> ఆప్షన్‌కి వెళ్లండి.  
  • ఆధార్ నెంబర్ నమోదు చేసి, సేవ్ క్లిక్ చేయండి.
  • ఆ తరువాత మీ మొబైల్‌కు వచ్చే OTP నమోదు చేయండి. 
  • ఇలా ఆధార్ లింక్ చేస్తే, నెలకు 12 తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.ః
  • ముందు నుంచే ప్రయాణికుల వివరాలు మాస్టర్ లిస్ట్‌లో నమోదు చేయండి. టికెట్ బుకింగ్ సమయంలో టైమ్ మిస్ కాకుండా వేగంగా బుక్ చేసుకోవచ్చు.
Read more Photos on
click me!

Recommended Stories