EPFO Withdrawal Rules: పీఎఫ్ నిబంధనల్లో మార్పు.. 10 ఏళ్ళకే డబ్బులు!

Published : Jul 18, 2025, 03:20 PM IST

EPFO Withdrawal Rules:  ఈపీఎఫ్ రూల్స్‌లో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతి 10 సం.లకు ఒకసారి ఉద్యోగులు తమ PF ఖాతా నుండి పాక్షికంగా లేదా పూర్తిగా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా కల్పించబోతుందట.

PREV
15
పీఎఫ్ నిబంధనల్లో మార్పులు

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) విత్‌డ్రా నిబంధనల్లో మార్పులు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగులు 58 ఏళ్ల వయస్సులో రిటైర్ అయిన తర్వాతే PF మొత్తాన్ని పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ,  సర్వీస్‌కి 10 సంవత్సరాల ముందు వారు పీఎఫ్ మొత్తాన్ని తీసుకునే అవకాశాన్ని కల్పించబోతుంది. అలాగే.. 10 సంవత్సరాల పాటు పనిచేసిన వారికీ పాక్షికంగా లేదా పూర్తిగా డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని సిద్ధం చేస్తోంది. దీని ద్వారా ప్రతి 10 ఏళ్లకోసారి ఉద్యోగులు తమ PFలోని మొత్తాన్ని వాడుకునే వెసులుబాటు పొందనున్నారు.

25
ప్రతి 10 ఏళ్లకోసారి విత్‌డ్రా అవకాశం!

మణికంఠ్ నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈ పథకం అమలు అయితే..  సుమారు 7 కోట్ల ప్రైవేట్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 10 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత ఉద్యోగులు ప్రతి దశాబ్దానికి ఒకసారి EPF ఫండ్‌ నుండి మొత్తాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు. పదవీ విరమణ వరకు వేచి ఉండకుండా, ఆర్థిక అవసరాలకు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నిర్ణయం EPFO ఉద్యోగులకు చాలా ప్రయోజనకరం. 

35
10 ఏళ్ల సర్వీసు తరువాత

ప్రస్తుతం పీఎప్ నిబంధనల ప్రకారం.. కనీసం 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు పింఛను ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే, పదవీ విరమణ వయస్సు వరకు ఎదురుచూడాల్సి రావడం వల్ల, మధ్యలో ఉద్యోగం మానేయాలనుకునే వారికి ఈ నిబంధన అడ్డంగా మారుతోంది.  ప్రతిపాదిత కొత్త సంస్కరణల ప్రకారం.. 10 ఏళ్ల  సర్వీస్ తర్వాత ఉద్యోగులు తమ EPF మొత్తాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా, జరిమానా లేకుండా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇది ఉద్యోగ మార్పులు, స్వయం ఉపాధి, లేదా రిటైర్మెంట్ కోసం ముందస్తు ప్రణాళికల విషయంలో మరింత ఆర్థిక మద్దతు కల్పించేలా ఉంది.

45
పదవీ విరమణ భద్రత

ఈ ప్రతిపాదిత మారుతున్న ఉపాధి ధోరణులను ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. చాలా మంది ఉద్యోగులు ముందుగానే పదవీ విరమణ చేయడం, కెరీర్ విరామాలు తీసుకోవడం లేదా స్వయం వ్యాపారాలు ప్రారంభించడం వంటి మార్గాలను అనుసరిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో, పదవీ విరమణ వరకు PF నిధిని అడ్డుకోవడం ఆచరణాత్మకంగా ఉండదు. ప్రతిపాదిత పథకం ఉద్యోగులకు అవసరమైన సమయంలో తమ పొదుపును విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించి, ఆర్థిక ప్రణాళికలో సౌలభ్యతను తీసుకురావడమే కాక, పదవీ విరమణ భద్రతను బలపరచడంలోనూ సహాయపడుతుంది.

55
రాబోయే కొత్త మార్పులు

పీఎఫ్ విత్‌డ్రా మార్పులతో పాటు, EPFO ఇటీవల ఉద్యోగుల ప్రయోజనాల కోసం మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో UPI లేదా ATM ద్వారా రూ.1 లక్ష వరకు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు, ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచింది. అలాగే, డాక్యుమెంట్ల సంఖ్యను 27 నుండి 18కి తగ్గించడంతో ప్రక్రియ మరింత సులభమైంది. ఇక గృహ రుణంపై EMIలు చెల్లించేందుకు, కనీసం 3 ఏళ్లు సర్వీసు ఉన్న ఉద్యోగులు తమ PF నుండి 90% వరకు నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు.  

Read more Photos on
click me!

Recommended Stories