పతంజలికి పోటీగా రిలయన్స్ 'పురవేద'.. ఆయుర్వేద రంగంలోకి ముఖేష్ అంబానీ

Published : Jul 31, 2025, 10:13 AM IST

Reliance Puraveda: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తాజాగా ఆయుర్వేద రంగంలోకి అడుగుపెట్టారు. ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తుల మార్కెట్లో బాబా రామ్‌దేవ్ పతంజలి బ్రాండ్‌కు గట్టి పోటీగా, రిలయన్స్‌ కొత్త బ్రాండ్ 'పురవేద' ను పరిచయం చేసింది.  

PREV
15
ఆయుర్వేద రంగంలోకి రిలయన్స్

రిలయన్స్ మరో కీలక రంగంలో ప్రవేశించింది. కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇప్పుడు ఆయుర్వేద రంగంలోకి అడుగుపెడుతున్నారు. రిలయన్స్ రిటైల్‌కు చెందిన బ్యూటీ ప్లాట్‌ఫామ్ ‘తిరా’తాజాగా ఒక కొత్త ఆయుర్వేద బ్యూటీ బ్రాండ్‌ను పరిచయం చేసింది. దీనికి 'పురవేద' అనే పేరు పెట్టారు.

25
పతంజలికి పోటీగా రిలయన్స్ 'పురవేద'

పురవేద బ్రాండ్ సంపూర్ణంగా ఆయుర్వేద సూత్రాలపై ఆధారపడి రూపొందించబడింది. విభిన్న శ్రేణులలో ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకరాబోతుంది. ఈ కొత్త లాంచ్ ద్వారా రిలయన్స్, బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి సహా ఇతర ఆయుర్వేద బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వబోతుంది.

35
అందానికి కొత్త నిర్వచనం

పురవేద ఆవిష్కరణ సందర్భంగా తిరా సహ వ్యవస్థాపకురాలు, CEO భక్తి మోడీ మాట్లాడుతూ.. 'పురవేదను ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రాండ్ భారతదేశ వారసత్వం, ఆవిష్కరణల మిశ్రమం. తిరాలో అందానికి అతీతంగా, స్వీయ సంరక్షణ కోసం ప్రజలను ప్రేరేపించే బ్రాండ్‌లను ముందుకు తీసుకురావాలని, మా ఉత్పత్తులతో అందాన్ని పునర్నిర్వచించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ' అని ప్రకటించారు.

45
'పురవేద'లో 50కి పైగా ఉత్పత్తులు

రిలయన్స్ కొత్త ఆయుర్వేద బ్రాండ్ ‘పురవేద’ ఉత్పత్తులు సాంప్రదాయ మూలికల ఆధారంగా రూపొందించినప్పటికీ, ఇవి పూర్తిగా ఆధునిక పద్ధతిలో తయారు చేయబడ్డాయి. ఈ బ్రాండ్‌లో చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ, శరీర సంరక్షణకు సంబంధించిన 50 కంటే ఎక్కువ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. ఈ ఉత్పత్తులు నాలుగు వేర్వేరు శ్రేణులుగా విభజించబడ్డాయి. ఈ ఉత్పత్తులు ‘తిరా’ స్టోర్స్‌, అలాగే ‘తిరా’ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

55
రెండేళ్ల క్రితమే ప్రారంభం

రిలయన్స్ రిటైల్ 2023 లోనే తిరాను ప్రారంభించింది. ఇది బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫామ్. తిరా భారతదేశంలోని 98% కంటే ఎక్కువ పిన్ కోడ్‌లకు డెలివరీ చేస్తుంది. దీనికి అనేక నగరాల్లో స్టోర్‌లు కూడా ఉన్నాయి. వీటి ఉత్పత్తులను స్టోర్ నుండి లేదా తిరా వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. తిరా ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన, ప్రకృతి ఆధారిత సౌందర్య ఉత్పత్తులను అందించడాన్ని ప్రధాన ఆశయంగా తీసుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories