UPI Biometric Update: యూపీఐ లావాదేవీలలో పెద్ద మార్పుకు తెరలేపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిద్ధమవుతోంది. త్వరలో పిన్ అవసరం లేకుండా, వాడుకదారులు బయోమెట్రిక్ ద్వారా చెల్లింపులు చేసే విధానాన్ని ప్రవేశపెట్టనుంది.
UPI Biometric Update:ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటిల్ పేమెంట్సే.. అర చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండి, బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో UPI భాగంగా మారింది. కూరగాయలు కొనడం నుంచి పెద్ద మొత్తాల చెల్లింపుల వరకు అన్నింటికీ UPI ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. అది కూడా ఒక్కే క్లిక్ తో. అలా యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పెద్ద మార్పు తీసుకురాబోతోంది. త్వరలో యూపీఐలో బయోమెట్రిక్ అప్‌డేట్ తీసుకరాబోతుందట. ఆ వివరాలేంటో ఓ లూక్కేయండి.
25
అర చేతిలో బ్యాంకింగ్
ప్రతి వ్యక్తి తన దైనందిక జీవితంలో డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇందుకోసం ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్నే వాడుతున్నారు. సులభంగా ఎలాంటి ఛార్జీలు లేకపోవడంతో డిజిటల్ పేమెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రోజుకో కొత్త అప్ డేట్స్ తీసుకొస్తూనే ఉంది. ఇప్పటికే యూపీఐ బ్యాలెన్స్ చెకింగ్ వంటి వాటిపై పరిమితులు విధించారు.
35
యూపీఐలో బయోమెట్రిక్ అప్‌డేట్
ఈ క్రమంలో వినియోగదారులు తమ లాభాదేవిలను మరింత మెరుగ్గా, సులభంగా అయ్యేలా మరో అప్డేట్ తీసుకొచ్చేందుకు ఎన్పీసీఐ సిద్ధమైంది. ఇకపై వినియోగదారులు తమ పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. యూపీఐలో బయోమెట్రిక్ అప్‌డేట్‌ను తీసుకురావడానికి ఎన్పీసీఐ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
యూపీఐలో బయోమెట్రిక్ అప్‌డేట్తో వినియోగదారులు తమ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్ లేదా ఫింగర్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. అయితే పిన్ కోసం కూడా ఆప్షన్ ఉంటుంది. ఈ అప్ డేట్ వల్ల పిన్ నంబర్‌లను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే.. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి స్పష్టమైన సమాచారం లేదు.
55
మరింత భద్రత
బయోమెట్రిక్ అప్డేట్తో ఈజీగా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఈ అప్ డేట్ చాలా ఉపయోగపడుతుంది. చదువుకోని వారు తమ పిన్ నంబర్లను గుర్తుంచుకోవడం కష్టంగా మారుతుంది. ఒక్కోసారి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ అప్డేట్ వల్ల సులభంగా లావాదేవీలు జరపడమే కాకుండా బయోమెట్రిక్ తో సురక్షితంగా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఇతరులు యాక్సెస్ చేయలేరు.