Hero Glamour 125: నయా లుక్ లో హీరో గ్లామర్ 125.. క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తున్న ఫస్ట్ బైక్ !

Published : Jul 31, 2025, 08:31 AM IST

Hero Glamour 125 features: కొత్త హీరో గ్లామర్ 125 త్వరలో ఇండియన్ మార్కెట్ లో విడుదల కానుంది. క్రూయిజ్ కంట్రోల్‌తో సహా అదిరిపోయే ఫీచర్స్ తో అందుబాటులోకి రాబోతుంది.

PREV
15
బెస్ట్ మైలేజ్ - లో మైంటైన్స్

Hero Glamour 125 features: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, లో మైంటైన్స్ బైక్‌లను కొనేందుకే చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి బైక్స్‌ ల్లో హీరో గ్లామర్ ( Hero Glamour)ఒకటి. త్వరలో న్యూ అప్టేట్స్ తో హీరో గ్లామర్ 125 రాబోతుంది. ఇంతకీ ఆ న్యూ బైక్ ప్యూచర్ ఎంటీ? ఎప్పుడు లాంఛ్ కాబోతుంది అనే వివరాలు మీ కోసం.

25
ప్రత్యేకతలు

గ్లామర్ అప్‌డేటెడ్ మోడల్‌లో LED టర్న్ ఇండికేటర్లు, పూర్తిగా డిజిటల్ కలర్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అప్‌డేటెడ్ స్విచ్ గేర్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. హీరో గ్లామర్ Xtec 2.0 అని పేరు పెట్టవచ్చు. గ్లామర్ లైనప్‌లో టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్‌గా పరిచయం చేయబడుతుంది. నిజానికి, హీరో ఇప్పటికే టాప్-ఎండ్ స్ప్లెండర్ ప్లస్ Xtec 2.0 ను అందిస్తోంది. అందుకే కొత్త బైక్ పేరు హీరో గ్లామర్ Xtec 2.0 అని చెప్పవచ్చు

35
క్రూయిజ్ కంట్రోల్

కొత్త హీరో గ్లామర్ 125 తో క్రూయిజ్ కంట్రోల్‌ రాబోతుంది. క్రూయిజ్ కంట్రోల్ అనేది వాహనాల్లో ఉండే బెస్ట్ ఫీచర్. ఇది వాహనాన్ని ఆటోమెటిక్ గా కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఈ సిస్టమ్‌ను ఆన్ చేస్తే.. డ్రైవర్ ముందుగా సెట్ చేసిన వేగాన్ని మాత్రమే చేరుకోగలదు. ఇలా చేయడం వల్ల కారు అంత వేగం కంటే వేగంగా నడవదు. బ్రేక్ లేదా యాక్సిలరేటర్ నొక్కినపుడు, సిస్టమ్ ఆ ఫంక్షన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తుంది.

45
ఇంజన్ సామర్థ్యం

కొత్త హీరో గ్లామర్ 125 ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. దీనికి అదే 124.7cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఇవ్వబడే అవకాశం ఉంది. బైక్ ఇంజిన్ 7500 rpm వద్ద 10.53 PS పవర్, 10.4 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హీరో ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంది. బైక్ టాప్ స్పీడ్ 95 kmph అండ్ ARAI-సర్టిఫైడ్ మైలేజ్ 65 kmpl. ఈ బైక్ ట్యాంక్ ఫుల్ చేస్తే 880 కిలోమీటర్లు ప్రయాణించవచ్చంట.

55
లాంఛింగ్ ఎప్పుడంటే?

కొత్త హీరో గ్లామర్ 125 అక్టోబర్ 2025 పండుగ సీజన్ నాటికి భారత మార్కెట్లో రాబోతుంది. దీని ధర రూ. 92 వేల నుండి రూ. 98 వేల మధ్య ఉంటుందని అంచనా. హీరో గ్లామర్ 125.. టీవీఎస్ రైడర్ 125, రాబోయే హోండా CB125 హార్నెట్‌తో పోటీపడబోతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories