Jio Pc AI: రిలయన్స్ జియో డిజిటల్ విప్లవం వైపు మరో పెద్ద అడుగు వేసింది. రిలయన్స్ సరికొత్త జియో పిసిని ప్రవేశపెట్టింది. ఇది క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్. దీని సహాయంతో టీవీ స్క్రీన్‌ను హై ఎండ్ పర్సనల్ కంప్యూటర్‌గా మార్చవచ్చు.
Jio Pc AI: మీరు కూడా కొత్త కంప్యూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా? అవును అయితే.. ఒక్క నిమిషం ఆగండి. మీ కోసం బెస్ట్ ఆప్షన్. వాస్తవానికి, రిలయన్స్ జియో తాజాగా కొత్త జియో-పిసి (Jio Pc AI)ని ప్రవేశపెట్టింది. ఇది క్లౌడ్ బేస్ వర్చువల్ డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్. దీని సహాయంతో మీరు ఇంట్లో లేదా ఆఫీస్ లోని ఏదైనా టీవీని అయినా నిమిషాల్లో హై ఎండ్ పర్సనల్ కంప్యూటర్‌గా మార్చవచ్చు.
26
Jio-PC పనిచేసే విధానం
Jio PC ఉపయోగించేందుకు Jio Fiber లేదా Jio AirFiber ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. Jio Set-Top Box కు టీవీకి కనెక్ట్ చేయాలి. కీబోర్డు, మౌస్ ని USB లేదా బ్లూటూత్ ద్వారా ప్లగ్ చేయాలి. ఆ తరువాత టీవీలో Jio PC App ని ఓపెన్ చేసి, Jio కనెక్షన్లతో లింక్ అయిన మొబైల్ నంబర్ తో లాగిన్ చేయాలి. ఒక్కసారి లాగిన్ అయితే.. మీ టీవీలో పవర్ఫుల్ వర్చువల్ కంప్యూటరు స్క్రీన్ కనిపిస్తుంది.
36
అదిరిపోయే ఫీచర్లు
Jio-PC అనేది పూర్తిగా క్లౌడ్‌లో నడిచే వర్చువల్ డెస్క్టాప్. కంప్యూటర్ ప్రాసెసింగ్, ఫైల్ స్టోరేజ్ అన్నీ జియో సర్వర్లలో అటాచ్ అయి ఉంటాయి. టీవీ కేవలం మానిటర్‌గా పనిచేస్తుంది. ఇది 8GB RAM, 100GB క్లౌడ్ స్టోరేజ్ (ట్రయల్‌లో 512GB వరకు) కలిగి ఉంటుంది. లినక్స్ బేస్డ్ OS పై పనిచేస్తూ, Adobe Express, జియో AI యాప్స్, లైబ్రేఆఫీస్ , వెబ్ ఆధారిత MS Office ఫీచర్లు అందిస్తుంది. వైరస్ & మాల్వేర్ ప్రొటెక్షన్‌తో పాటు కెమెరా, ప్రింటర్, USB వంటి పరికరాలు కనెక్ట్ చేసుకోవచ్చు.
Jio PC AI సర్వీస్ కోసం వివిధ రకాల ఫ్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్క నెల ప్లాన్ ₹599కి లభించగా, 2 నెలల ప్లాన్ ₹999కి అందుబాటులో ఉంది. ₹1,499తో రిఛార్జ్ చేస్తే నాలుగు నెలల సేవలు పొందవచ్చు. అలాగే.. రూ 2,499 రిఛార్జ్ చేస్తే.. ఆరు నెలల ప్లాన్‌తో మరో రెండు నెలలు ఉచితంగా పొందవచ్చు. ఇలా మొత్తం 8 నెలల పాటు సేవలు పొందవచ్చు. ఇక రూ. 4,599తో వార్షిక ప్లాన్ తీసుకుంటే అదనంగా 3 నెలలు ఉచితంగా లభిస్తాయి.
ప్రతి ప్లాన్ లో 100GB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు జియో-పిసి (Jio PC)ని ఉపయోగించడానికి అదనపు నెలవారీ ప్లాన్‌ను తీసుకోవాలి.
న్యూ కస్టమర్స్ ఈ సర్వీస్ ను ఒక నెల పాటు ఉచితంగా పొందవచ్చు. ఇక వినియోగదారులు తమ అవసరానికి తగిన ప్లాన్ ఎంచుకుని, ఎంతకాలమైనా సులభంగా ఉపయోగించుకోవచ్చు. సంవత్సరానికి లాంగ్ టెర్మ్ ప్లాన్ తీసుకుంటే నెలకు సుమారు ₹400తో లభిస్తుంది.
56
మొట్టమొదటి ‘పే-యాజ్-యు-గో’ క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్
జియో PC సర్వీస్ న దేశంలోనే మొట్టమొదటి ‘పే-యాజ్-యు-గో’ క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్ గా జియో ప్రకటించింది. మీరు దీన్ని ఎంత ఉపయోగిస్తారో అంతకు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో ఎలాంటి లాక్-ఇన్ వ్యవధి లేదు. ఒక్క ప్లాన్‌తో వినియోగదారులు ఎటువంటి నిర్వహణ ఖర్చు లేకుండా, ఖరీదైన హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయవలసిన అవసరం లేకుండా కేవలం మీరు ప్లగిన్ చేసి సైన్ అప్ అయితే చాలు – క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్ అనుభవాన్ని టీవీ మీదే పొందవచ్చు.
66
రూ. 400తోనే రూ 50,000 విలువైన పవర్‌ఫుల్ కంప్యూటర్ మీ టీవీలోనే!
క్లౌడ్ ఆధారిత జియో-పీసీ చాలా శక్తివంతమైనదని జియో చెబుతోంది. దీని ప్రాసెసింగ్ పవర్ కూడా గొప్పగా ఉండబోతోందట. ఇది రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్, గ్రాఫిక్ రెండరింగ్ వంటి హై-ఎండ్ వర్క్ ను సులభంగా చేస్తోంది. జియో-పీసీ లాంటి పవర్ కంప్యూటర్ ను మార్కెట్లో కొనాలంటే.. రూ. 50 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జియో ఈ సౌకర్యాన్ని కేవలం రూ.400 నెలవారీ ప్లాన్‌పై అందిస్తోంది. అంటే నెలకు రూ.400 చెల్లించడం ద్వారా మీరు రూ.50 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు అన్ని ప్రత్యేక AI టూల్స్, అప్లికేషన్లు, 512GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ను కూడా పొందవచ్చు.