Post Office PPF Scheme: మీరు సురక్షితమైన, పన్ను మినహాయింపు గల, స్థిరమైన దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే PPF స్కీమ్ బెస్ట్ ఛాయిస్. ఈ పథకంలో రోజుకు కేవలం ₹411పెట్టుబడి పెడితే 43.60 లక్షలు పొందవచ్చు. ఈ పథకం పూర్తి వివరాలు.
Post Office PPF Scheme: మీరు సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి కోసం చూస్తున్నారా? పన్ను మినహాయింపు కలిగిన దీర్ఘకాలిక పెట్టుబడి కోసం వెతుకుతున్నవారికి పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ బెస్ట్ ఆప్షన్. భారత ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న ఈ పథకంలో రోజుకు కేవలం ₹411, అంటే నెలకు ₹12,500 పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల తర్వాత ₹43.60 లక్షల మెచ్యూరిటీ అమౌంట్ పొందే అవకాశముంటుంది.
25
పిపిఎఫ్ పథక విశేషాలు:
PPF ఖాతా 15 ఏళ్ల సంవత్సరాల పాటు నడుస్తుంది. ప్రస్తుతం 7.9% వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. సంవత్సరానికి రూ. 500 నుండి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టండి. ఉదాహరణకు సంవత్సరానికి రూ. 1.5 లక్షలు (నెలవారీగా రూ. 12,500 లేదా రోజుకు రూ. 411) డిపాజిట్ చేయడం వల్ల స్కీమ్ మెచ్యూరిటీ సమయానికి ఏకంగా రూ. 43.60 లక్షలు మీ ఖాతాలో జమ అవుతుంది. ఇందులో వడ్డీ రూ. 21.10 లక్షలు. ఈ మొత్తం పూర్తిగా పన్ను రహితమైనదిగా సెక్షన్ 80C కింద లభిస్తుంది
35
మూలధన భద్రత
పిపిఎఫ్ పథకం పెట్టుబడిదారులకు పూర్తి భద్రత కల్పిస్తుంది. ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకం మూలధన నష్టానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పాటు డిపాజిట్ చేసిన మొత్తం, సంపాదించిన వడ్డీ రెండూ పన్ను మినహాయింపు పొందవచ్చు. జీతం పొందేవాళ్లు, చిన్న వ్యాపారులు, లేదా పిల్లల భవిష్యత్తు లేదా పదవీ విరమణ కోసం ముందస్తు ప్రణాళిక వేసుకునే వారికి బెస్ట్ స్కీమ్ ఇది.
PPF ఖాతాను తెరవడం, నిర్వహించడం చాలా సులభం. డబ్బును ఏకకాలంలో లేదా నెలవారీగా/వార్షికంగా (గరిష్ఠంగా 12 వాయిదాలలో) చెల్లించవచ్చు. అయితే ఖాతాను యాక్టివ్‌గా ఉండాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం ₹500 డిపాజిట్ చేయాలి. ఒక వ్యక్తి తన పేరుపై మాత్రమే ఖాతా తెరవచ్చు. ఉమ్మడి ఖాతాలు అనుమతించబడవు. ప్రత్యేక రుణ సౌకర్యం పొందడం ఈ ప్లాన్ ప్రత్యేకత. అత్యవసర సమయాల్లో అంటే 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం మధ్యకాలంలో రుణ సౌకర్యం పొందవచ్చు.
55
నిమిషాల్లో డిజిటల్ డిపాజిట్:
సులభమైన లావాదేవిల కోసం పోస్ట్ ఆఫీస్ IPPB (ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్) యాప్ లేదా DakPay ద్వారా ఆన్‌లైన్ డిపాజిట్స్ చేయవచ్చు. మీ ఖాతాను లింక్ చేయండి, మీ PPF వివరాలను నమోదు చేయండి. కేవలం కొన్ని క్లిక్‌లలో నిధులను బదిలీ చేయవచ్చు. మీరు మంచి రాబడి, పన్ను ప్రయోజనాలతో సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడిని కోరుకుంటే.. PPF పథకంలో పెట్టుబడి పెట్టడం మేలు.