ఫ్యాన్సీ నెంబర్ కావాలని ఎవరు కోరుకోరు. మొబైల్, కార్, బైక్ ఇలా దేనికైనా ఫ్యాన్సీ నంబర్ ఉంటే చాలా బాగుంటుంది. ఈ నంబర్ చెప్పడానికైనా, చదవడానికైనా, గుర్తు పెట్టుకోవడానికైనా ఈజీగా ఉంటుంది. అందుకే అందరూ ఫ్యాన్సీ నంబర్స్ ని ఇష్టపడతారు. కానీ ధర ఎక్కువగా ఉంటుందని చాలామంది తీసుకోవడానికి ఆలోచిస్తారు. అయితే వేలం ద్వారా ఫ్యాన్సీ నెంబర్ ఈజీగా సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యాన్సీ నంబర్ తీసుకోవడం ఖర్చుతో పని
ఇటీవల కార్లు, బైకుల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని కొనేటప్పుడే ఫ్యాన్సీ నంబర్ తీసుకోవాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా యూత్ ఫాన్సీ నంబర్ల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఫ్యాన్సీ నంబర్ సంపాదించడం ఖర్చుతో కూడుకున్న పని. అయినప్పటికీ తాము కోరుకున్న నంబర్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు.
ఫ్యాన్సీ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి
మీ కారు లేదా బైక్ కి ఫ్యాన్సీ నంబర్ కావాలంటే వెహికల్ కొనేటప్పుడే ఫ్యాన్సీ నంబర్ కోసం అప్లై చేసుకోవాలి. ఆన్ లైన్ లో రవాణా మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజస్ట్రేషన్ అంతా సక్సెస్ ఫుల్ గా జరిగితే మీకు అందుబాటులో ఉన్న ఒక ఫ్యాన్సీ నంబర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం సెలెక్ట్ చేసుకున్న నంబర్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
వేలంలో సొంతం చేసుకోవాలి
రవాణా మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో మీరు సెలెక్ట్ చేసి, రిజిస్టర్ చేసుకున్న ఫ్యాన్సీ నంబర్ అధికారులు వేలం నిర్వహిస్తారు. ఎందుకంటే మీరు కోరుకున్న నంబర్నే చాలా మంది కావాలని అనుకుంటారు. అందుకే అధికారులు వేలం నిర్వహిస్తారు. వేలంలో పాల్గొని ఎవరైతే ఎక్కువ ధరకు పాడతారో వారికే ఫ్యాన్సీ నంబర్ దక్కుతుంది.
ఫ్యాన్సీ నంబర్ కి ఇలా అప్లై చేయండి
రవాణా మంత్రిత్వ శాఖ అఫీషియల్ వెబ్ సైట్(http://morth.nic.in)లోకి వెళ్లండి. కొత్త అకౌంట్ ఓపెన్ చేసి, మీ దగ్గర్లోని ఆర్టీవో ఆఫీసును సెలెక్ట్ చేసుకోండి. అందులో ఫ్యాన్సీ నంబర్స్ లిస్ట్ చెక్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించండి. తర్వాత అధికారులు నిర్వహించిన వేలంలో పాల్గొని అందరికంటే ఎక్కువకు పాడకొని మీకిష్టమైన ఫ్యాన్సీ నంబర్ సొంతం చేసుకోండి. ఒకవేళ వేలంలో మీరు గెలవకపోతే మీ రిజిస్ట్రేషన్ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తారు.