భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో రూ. 100, రూ. 200 నోట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కేవలం రూ. 500 నోట్ల చలామణీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది.
రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం ప్రకారం, ఇకపై దేశంలోని అన్ని బ్యాంకులు తమ ATMలలో తప్పనిసరిగా రూ.100, రూ.200 నోట్లు ఉంచాలి. ఈ మార్పు కోసం బ్యాంకులు కొత్త మెషీన్లు కొనాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న ATMలలోనే సులభంగా ఈ సదుపాయం కల్పించవచ్చు.
DID YOU KNOW ?
ఆర్బీఐ ఆదేశాలు
2025 సెప్టెంబర్ 30 నాటికి ATMలలో 75%, 2026 మార్చి 31 నాటికి 90% ATMలలో చిన్న నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ సూచించింది.
25
చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకే
కొన్ని నెలలుగా మార్కెట్లో చిన్న నోట్ల కొరత ఎక్కువగా కనిపిస్తోంది. దుకాణాల్లో, చిన్న లావాదేవీల్లో చిల్లర లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల వ్యాపారులు “UPI వాడండి” అని చెప్పాల్సి వస్తోంది. ఈ సమస్యను తగ్గించేందుకు RBI ఈ నిర్ణయం తీసుకుంది.
35
ATMలలో కొత్త సౌకర్యం
ఇప్పటి వరకు ఏటీఎమ్‌లలో ఎక్కువగా రూ. 500 నోట్లే వస్తున్నాయి. దీంతో మార్కెట్లో చిల్లర పెద్ద సమస్యగా మారింది. ఇకపై ప్రజలు ATMల నుంచి రూ.100, రూ. 200 నోట్లు సులభంగా తీసుకోగలరు. RBI ఆదేశాల ప్రకారం అన్ని బ్యాంకులు, అలాగే వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు (ప్రైవేట్ ATM సర్వీసులు) కనీసం ఒక క్యాసెట్‌లో తప్పనిసరిగా చిన్న నోట్లు ఉంచాలి.
ఈ నిర్ణయం దశలవారీగా అమల్లోకి వస్తుంది. 2025 సెప్టెంబర్ 30 నాటికి – దేశవ్యాప్తంగా ఉన్న ATMలలో 75% వరకు చిన్న నోట్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. 2026 మార్చి 31 నాటికి – 90% ATMలలో ఈ నిబంధన పాటించాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
55
బ్యాంకులకు ప్రత్యేక ఖర్చు లేదు
ఈ మార్పు కోసం బ్యాంకులు కొత్త మెషీన్లు కొనాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ATMలలో చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. అదనంగా, ATMలలో క్యాసెట్ ఖాళీగా ఉంచడం లేదా డబ్బు నింపకపోవడం వంటి సమస్యలు లేకుండా చూడాలని RBI స్పష్టంగా తెలిపింది.