జీవితంలో ఓ ఇల్లు ఉండాల‌ని అనుకుంటున్నారా.? ముందే అల‌ర్ట్ అవ్వండి..

Published : Aug 26, 2025, 11:32 AM IST

ఇల్లు క‌ట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటుంటారు. ఇంటికి ఉన్న ప్రాధాన్య‌త ఎలాంటిదో చెప్పేందుకు ఇదే నిద‌ర్శ‌నం. అయితే ఈ సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవాలంటే ముందు నుంచే ఓ ప్లానింగ్ వేసుకోవాల‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

PREV
15
సొంతిల్లు ప్ర‌తీ ఒక్క‌రి క‌ల

ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు స్వంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. కొందరు చిన్న వయసులోనే కొనుగోలు చేస్తారు, మరికొందరు రిటైర్మెంట్ తర్వాత సాధిస్తారు. ఇంకొందరికైతే ఆ కల అసంపూర్తిగానే మిగిలిపోతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముందుగానే ప్రణాళిక వేసుకొని సరిగ్గా సేవింగ్స్ చేస్తే ఇల్లు కొనడం అంత కష్టం కాదు.

DID YOU KNOW ?
ముందు నుంచే పొదుపు చేయండి
నిపుణులు సూచన ప్రకారం, ఇల్లు కొనాలనుకునే వారు కనీసం 5–6 సంవత్సరాల ముందే సేవింగ్స్ ప్రారంభించాలి.
25
ముందస్తు ప్రణాళిక ఎందుకు అవసరం?

ఇల్లు కొనాలని నిర్ణయించుకున్న వెంటనే లొకేషన్, ప్రాజెక్ట్, బడ్జెట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. నగరాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో స్థిరపడాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే నగరంలోని మధ్యతరగతి వారికి సరసమైన ఇళ్లు అరుదుగా కనిపిస్తున్నాయి. అయినా, నగర పరిసర ప్రాంతాల్లో బడ్జెట్‌కు తగ్గ ప్రాజెక్టులు వస్తున్నాయి. వాటిని గుర్తించాలి.

35
ముందు నుంచే పొదుపు మొద‌లు పెట్టండి

నిపుణులు సూచన ప్రకారం, ఇల్లు కొనాలనుకునే వారు కనీసం 5–6 సంవత్సరాల ముందే సేవింగ్స్ ప్రారంభించాలి. మొదటి జీతం వచ్చేసరికి ప్రతి నెల ఒక స్థిరమైన మొత్తాన్ని విడిగా పెట్టుకోవాలి. ఇది తరువాత హౌసింగ్ లోన్ కోసం అవసరమయ్యే 20% డౌన్ పేమెంట్ కు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, నెలకు రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని సైడ్‌లో ఉంచుకుంటే, ఆ మొత్తం భవిష్యత్తులో EMI భారం తగ్గించడంలో సహాయపడుతుంది.

45
పెట్టుబడుల ఎంపిక

సేవింగ్స్‌ను కేవలం బ్యాంక్ అకౌంట్‌లో ఉంచకుండా, మంచి రాబడులు ఇచ్చే పద్ధతుల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ప్ర‌ధానంగా

* వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)

* మ్యూచువల్ ఫండ్ SIPలు

* బంగారం (Gold)

* నమ్మకమైన చిట్ ఫండ్లు

* బ్యాంకు లేదా పోస్టల్ స్కీములు. ఇవన్నీ భవిష్యత్తులో ఇల్లు కొనుగోలుకు కావాల్సిన బలమైన ఆర్థిక స్థాయిని ఇస్తాయి.

55
బ‌డ్జెట్ ముఖ్యం

ఇల్లు కొనేటప్పుడు ఎప్పుడూ తమ ఆర్థిక సామర్థ్యానికి లోబడి ఉండే ఇంటినే ఎంచుకోవాలి. ఎక్కువ EMIల ఒత్తిడి వల్ల జీవనశైలి ప్రభావితం కాకుండా చూసుకోవాలి. ఒకేసారి రెడీ హౌస్ కొనడం కష్టమైతే ముందుగా ప్లాట్ కొనుగోలు చేసి తరువాత నిర్మించుకోవచ్చు. కొందరు అయితే భూమిలోని ఒక భాగాన్ని అమ్మి, ఆ డబ్బుతో ఇల్లు నిర్మిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories