వినాయక చవితి 11 రోజులు ఈ 5 బిజినెస్ లు చేశారో... లక్షలు సంపాదించవచ్చు

Published : Aug 25, 2025, 11:46 PM ISTUpdated : Aug 25, 2025, 11:55 PM IST

వినాయక చవితి వస్తోంది… ఈ పండక్కి కొన్నిరకాల వ్యాపారాలు చేస్తే కేవలం పదిపదకొండు రోజుల్లో లక్షలు సంపాదించవచ్చు. అలాంటి 5 వ్యాపారాలేమిటో ఇక్కడ చూద్దాం.   

PREV
15
ఈ వినాయక చవితికి లక్షల సంపాదన

ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27 వస్తోంది. అప్పటినుండి 11 రోజులపాటు అంటే సెప్టెంబర్ 6 వరకు దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇళ్ళు, వీధులు, దేవాలయాలు, కమ్యూనిటీ హాల్స్ అన్ని చోట్లా వినాయక విగ్రహాలు ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ సమయంలో పూజా సామాగ్రి, అలంకరణ వస్తువులు, తీపి పదార్థాలు, డెకరేషన్ లైట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి భక్తితో పాటు వ్యాపారానికి కూడా ఇది మంచి అవకాశం. మంచి ప్రణాళికతో చిన్న వ్యాపారంచేసినా 11 రోజుల్లో మంచి లాభాలు సంపాదించవచ్చు.

25
వినాయక విగ్రహాలు

నేడు ప్రజలు మట్టి, విత్తనాలతో చేసిన పర్యావరణహిత విగ్రహాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఒక్క విగ్రహం తయారీకి 300-600 రూపాయలు ఖర్చవుతుంది. కానీ మార్కెట్లో వీటిని 1200-2500 రూపాయలకు అమ్మవచ్చు. 200 విగ్రహాలు అమ్మితే కనీసం లక్ష రూపాయల వరకు లాభం వస్తుంది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే అమ్మకాలు పెరుగుతాయి. ఇలా చిన్నచిన్న వినాయక విగ్రహాలను అమ్మినా లక్షల్లో ఆదాయం పొందవచ్చు.

35
పూజా సామాగ్రి ఆండ్ అలంకరణలు

కొబ్బరికాయలు, పూలు, కర్పూరం, ధూపం, పండుగ అలంకరణ వస్తువులకు ఈ సమయంలో మంచి డిమాండ్ ఉంటుంది. 300 రూపాయలతో తయారు చేసిన పూజా కిట్‌ను 600-800 రూపాయలకు అమ్మవచ్చు. 200-250 కిట్‌లు అమ్మితే లక్ష రూపాయల ఆదాయం సాధ్యమే. అందంగా ప్యాక్ చేస్తే కస్టమర్లు ఆకర్షితులవుతారు.

45
తీపి పదార్థాలు, మోదకాలు

వినాయక చవితికి మోదకాలు, లడ్డూలు ప్రధానం. ఒక్క కిలోకి 150-200 రూపాయల లాభం వస్తుంది. 11 రోజుల్లో 400-500 కిలోలు అమ్మితే 70,000-1,00,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే యువత కోసం చక్కెర లేని మోదకాలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. 

అయితే ఇక్కడ సూచించిన వ్యాపారాల్లో లాభాలు కేవలం అంచనాలు మాత్రమే. అసలు లాభం మీ శ్రమ, పెట్టుబడి, మార్కెట్ డిమాండ్, ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది.

55

Read more Photos on
click me!

Recommended Stories