Post Office Scheme : నెలకు రూ.12 వేలు కడితే రూ.20 లక్షలు మీ సొంతం.. పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్ !

Published : Jan 05, 2026, 05:27 PM IST

Post Office Scheme : పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో రోజుకు రూ.400 పొదుపు చేసి రూ.20 లక్షలు పొందవచ్చు. ప్రభుత్వ భరోసాతో కూడిన ఈ స్కీమ్ వడ్డీ రేట్లు, పూర్తి కాలిక్యులేషన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
రూ.100తో ఖాతా తెరవండి.. రూ.20 లక్షలు పొందండి.. పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ !

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని ఆలోచిస్తుంటారు. అయితే, ఆ డబ్బు ఎక్కడ మదుపు చేయాలి? అది ఎంతవరకు సురక్షితం? అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తుంటాయి. రిస్క్ లేకుండా మంచి రాబడిని కోరుకునే వారికి పోస్టాఫీస్ పథకాలు ఎప్పుడూ బెస్ట్ ఎంపికగా నిలుస్తాయి.

భారతీయ తపాలా శాఖ (India Post) ప్రజల కోసం అనేక రకాల చిన్న పొదుపు పథకాలను అందిస్తోంది. వీటిలో ప్రభుత్వం నుంచి భద్రత లభించడమే కాకుండా, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (Post Office Recurring Deposit) పథకం ద్వారా చిన్న మొత్తాలతో పెద్ద నిధిని సృష్టించుకోవచ్చు. రోజుకు కేవలం 400 రూపాయలు ఆదా చేయడం ద్వారా దాదాపు రూ.20 లక్షల వరకు పొందవవచ్చు.

26
పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ : ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకంపై ప్రభుత్వం 6.70 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

ఈ పథకం సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూపొందించారు. ఇందులో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. కేవలం 100 రూపాయల కనీస మొత్తంతో కూడా ఇందులో ఖాతా తెరవవచ్చు. మీరు చేసే చిన్న చిన్న పొదుపులు భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

36
Post Office Scheme : మెచ్యూరిటీ, అర్హతలు ఇవే

ఈ ప్రభుత్వ పథకంలో ఎవరైనా ఖాతా తెరవవచ్చు. 10 ఏళ్లు నిండిన మైనర్ల పేరు మీద కూడా ఖాతా తీసుకునే వెసులుబాటు ఉంది. 10 ఏళ్ల లోపు పిల్లలైతే వారి తల్లిదండ్రుల సంరక్షణలో ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఆ పిల్లలకు 18 ఏళ్లు నిండగానే, కొత్త కేవైసీ వివరాలు అందించి ఖాతాను వారి పేరు మీదకు మార్చుకోవచ్చు.

పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు. అంటే మీరు ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదేళ్ల తర్వాత కూడా మీరు ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటే, మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.

46
పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ : ముందస్తు విత్ డ్రా, క్లోజర్

పెట్టుబడిదారులకు అవసరమైనప్పుడు డబ్బు తీసుకునే వెసులుబాటును కూడా పోస్టాఫీస్ కల్పిస్తోంది. ఒకవేళ మీరు మెచ్యూరిటీ సమయానికి ముందే ఖాతాను మూసివేయాలనుకుంటే, ఖాతా తెరిచిన 3 సంవత్సరాల తర్వాత ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీనిని ప్రీమెచ్యూరిటీ క్లోజర్ అంటారు.

దురదృష్టవశాత్తు ఖాతాదారుడు మరణిస్తే, నామినీ ఆ డబ్బును క్లేయిమ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, నామినీ కోరుకుంటే ఆ ఖాతాను మెచ్యూరిటీ వరకు కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ఇది కుటుంబ భద్రతకు భరోసా ఇస్తుంది.

56
Post Office RD Scheme : లోన్ సౌకర్యం

కేవలం వడ్డీ రాబడి మాత్రమే కాకుండా, ఈ పథకంలో లోన్ సదుపాయం కూడా ఉంది. ఖాతా తెరిచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, మీ ఖాతాలో ఉన్న మొత్తంలో 50 శాతం వరకు లోన్ రూపంలో తీసుకోవచ్చు.

ఈ లోన్‌పై 2 శాతం వడ్డీ వసూలు చేస్తారు. అత్యవసర సమయాల్లో డబ్బు కోసం ఇతరులపై ఆధారపడకుండా, మీ పొదుపు నుంచే రుణం పొందే అవకాశం ఉండటం ఈ పథకం మరొక ప్రత్యేకత. మీరు మీ సమీపంలోని ఏ పోస్టాఫీసులోనైనా ఈ ఖాతాను తెరవవచ్చు.

66
పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ : రూ.20 లక్షల రాబడి లెక్క ఇదే

ఇప్పుడు రోజుకు రూ.400 పొదుపుతో రూ.20 లక్షలు ఎలా పొందవచ్చో లెక్కిద్దాం. పోస్టాఫీస్ ఆర్‌డీ కాలిక్యులేటర్ (RD Calculator) ప్రకారం ఈ గణాంకాలు ఉంటాయి.

ఒక వ్యక్తి రోజుకు రూ.400 ఆదా చేస్తే, నెలకు రూ.12,000 అవుతుంది. ఈ మొత్తాన్ని ప్రతి నెలా పోస్టాఫీస్ ఆర్‌డీలో 5 సంవత్సరాల పాటు జమ చేస్తే.. 6.70 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీ సమయానికి రూ.8,56,388 చేతికి అందుతాయి.

ఒకవేళ మీరు ఈ మొత్తాన్ని తీసుకోకుండా, ఖాతాను మరో 5 ఏళ్లు పొడిగించినట్లయితే (మొత్తం 10 ఏళ్లు), మీ పెట్టుబడి అద్భుతమైన రాబడిని ఇస్తుంది. 10 ఏళ్లలో మీరు జమ చేసే అసలు మొత్తం రూ.14.40 లక్షలు అవుతుంది. దీనిపై వడ్డీ రూపంలో రూ.6,10,248 లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ తర్వాత మీకు లభించే మొత్తం ఫండ్ రూ.20,50,248 అవుతుంది. ఇలా చిన్న మొత్తంతో ప్రారంభించి రూ.20 లక్షల భారీ నిధిని సొంతం చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories