భార్యాభ‌ర్త‌ క‌లిసి ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే.. నెల‌కు రూ. 9 వేలు వ‌స్తాయి. ఎంత పెట్టుబ‌డి పెట్టాలంటే.

Published : Sep 01, 2025, 12:47 PM IST

ఉద్యోగ లేదా వ్యాపారం విర‌మ‌ణ త‌ర్వాత ప్ర‌తీ ఒక్క‌రూ నెల‌వారీ ఆదాయాన్ని కోరుకుంటారు. ఇందుకోసం ర‌క‌ర‌కాల ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక బెస్ట్ పెట్టుబ‌డి ప‌థకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం

ప్రస్తుతం బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తుంటే, పోస్టాఫీస్ పథకాలు మాత్రం పెట్టుబడిదారులకు భరోసానిచ్చే స్థిరమైన వడ్డీని ఇస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును తగ్గించడంతో బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల వడ్డీ తగ్గినా, పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు జరగలేదు. అందుకే చాలా మంది పెట్టుబడిదారులు ఇలాంటి ప్రభుత్వ భరోసా కలిగిన పథకాలను ఎంచుకుంటున్నారు.

DID YOU KNOW ?
ఎంత వడ్డీ వస్తుంది.?
2025 ఆగస్టు నాటికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వడ్డీ రేటు 7.4% వార్షికంగా ఉంది.
25
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ప్రత్యేకత

పోస్టాఫీస్ అందిస్తోన్న బెస్ట్ ప‌థ‌కాల్లో మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ ఒక‌టి. ప్ర‌తీ నెల‌ స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి మంచి అవకాశం. ఒకేసారి పెట్టుబడి చేస్తే, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా నేరుగా పొదుపు ఖాతాలో జమవుతుంది. ఈ పథకం గడువు 5 సంవత్సరాలు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత పెట్టుబడి చేసిన అసలు మొత్తం తిరిగి లభిస్తుంది.

35
ఎంత వరకు పెట్టుబడి పెట్టవచ్చు?

ఈ పథకంలో వ్యక్తిగత ఖాతా ద్వారా గరిష్టంగా రూ.9 లక్షలు వరకు డిపాజిట్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇలా అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా నెలవారీగా మంచి వడ్డీ పొందవచ్చు.

45
వడ్డీ రేటు, లాభం

2025 ఆగస్టు నాటికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వడ్డీ రేటు 7.4% వార్షికంగా ఉంది. ఉదాహరణకు భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్‌లో రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే, వారికి ప్రతి నెలా సుమారు రూ. 9,250 వరకు వడ్డీ వస్తుంది. అంటే బ్యాంకుల కంటే ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది.

55
ఎందుకు సురక్షితం?

ఈ పథకానికి భారత ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. కాబట్టి పెట్టుబడి మొత్తానికి ఎలాంటి ప్రమాదం లేదు. ప్రతి నెలా స్థిరమైన వడ్డీ రావడం వల్ల క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు. రిటైర్డ్ వ్యక్తులు, గృహిణులు లేదా ప్రతి నెలా ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories