సెప్టెంబర్ 1 నుంచి ఈ రూల్స్ అన్నీ మారుతున్నాయి, తెలుసుకోండి

Published : Sep 01, 2025, 11:53 AM IST

సెప్టెంబర్ 1, 2025.. అంటే ఈ రోజు నుంచి చాలా రూల్స్  మారిపోతున్నాయి. క్రెడిట్ కార్డ్ నుంచి గ్యాస్ ధరల వరకు చాలా అంశాల్లో మార్పులు జరిగాయి. అవేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

PREV
15
సెప్టెంబర్ 1 నుంచి మారుతున్న రూల్స్

ప్రతి నెల ఒకటవ తేదీన కొన్ని రూల్స్ మారడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం కొత్త విధానాలను ప్రతి నెల ఒకటో తేదీన అమల్లోకి తెస్తుంది. పాతవి అప్‌డేట్ అవుతాయి. ఈసారి సెప్టెంబర్ 1 నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. ఇవి మీ ఖర్చులు, పొదుపులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకోండి.

25
క్రెడిట్ కార్డ్ రూల్ మార్పు

ఎస్‌బిఐ క్రెడిట్ కార్డు రూల్స్‌లో ఎన్నో మార్పులు చేసింది. మీరు ఎస్ బీఐకు చెందిన క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటే  సెప్టెంబర్ 1 నుంచి మారే రూల్స్ గురించి తెలుసుకోండి.  ఆన్‌లైన్ గేమ్స్, కొన్ని షాపులు, ప్రభుత్వ చెల్లింపులకు రివార్డ్ పాయింట్స్ ను ఎస్ బీఐ ఇవ్వదు.  దీనివల్ల ఆ కార్డు యూజర్లకు నష్టం కలిగే అవకాశం ఉంది.

35
వెండి నగల హాల్‌మార్క్

బంగారం లాగే వెండికి కూడా ఇకపై హాల్‌మార్క్ రూల్ వస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి వెండి నగలకు హాల్‌మార్క్ తప్పనిసరి అవుతోంది. మొదట్లో ఇది ఆప్షనల్ గానే ఉంటుంది. కానీ తరువాత మాత్రం ఇది తప్పనిసరిగా మారుతుంది.  అందుకే కస్టమర్లు వెండి నగలు కూడా హాల్‌మార్క్ ఉన్న వాటినే కొనడం మంచిది.

45
ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల్లో మార్పు

ప్రతి నెల ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. కొన్ని నెలలు పెరుగుతాయి, కొన్ని నెలలు తగ్గుతాయి. సెప్టెంబర్ 1న మళ్ళీ ధరలు మారుతున్నాయి. సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు కూడా మారవచ్చు. కాబట్టి వాటి గురించి మీరు ఆయా సంస్థల ప్రతినిధులతో మాట్లాడి తెలుసుకోండి.

55
పోస్టల్ సర్వీస్ మార్పు

పోస్టల్ సర్వీసులో కొన్ని రకాల కీలక మార్పులు కనిపించవచ్చు. రిజిస్టర్డ్ పోస్ట్ ఇకపై పనిచేయదు. దాన్ని తీసుకుని స్పీడ్ పోస్ట్‌లో కలిపేశారు. సెప్టెంబర్ 1 నుంచి మీరు పంపే రిజిస్టర్డ్ పోస్ట్‌లు స్పీడ్ పోస్ట్ ద్వారా వెళ్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories