మీ డ‌బ్బులే డ‌బ్బుల‌ను సంపాదిస్తాయి.. ఇలా చేస్తే ప్ర‌తీ నెల మీ అకౌంట్‌లోకి రూ. 9 వేలు వచ్చేస్తాయి

Published : Oct 21, 2025, 11:18 AM IST

Post office: ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏ ప‌ని చేసే వారైనా స‌రే ప‌ద‌వి విర‌మ‌ణ త‌ర్వాత స్థిర ఆదాయాన్ని కోరుకుంటారు. ఇలాంటి వారికి బెస్ట్ ఆప్ష‌న్‌గా నిలుస్తోంది పోస్టాఫీస్‌. ఇలాంటి ఒక బెస్ట్ ప‌థ‌కం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
పోస్ట్ ఆఫీస్ MIS ప‌థ‌కం

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (Monthly Income Scheme - MIS) అనేది ఒక ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ స్కీమ్, ఇందులో పెట్టుబడిదారులు ఒకేసారి ఒక మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి నెల వారికి వడ్డీ రూపంలో స్థిర ఆదాయం వస్తుంది. ఈ పథకం మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావానికి దూరంగా ఉంటుంది. అంటే ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా మీ ఆదాయం మాత్రం మార‌దు. దీంతో ఇదొక బెస్ట్ రిస్క్-ఫ్రీ పెట్టుబడిగా మారింది.

25
వడ్డీ రేటు, పెట్టుబడి పరిమితులు

* ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ఈ ప‌థ‌కంపై వార్షిక వడ్డీ రేటును 7.4 శాతంగా నిర్ణ‌యించారు.

* ఇందులో క‌నీస డిపాజిట్‌ మొత్తం రూ. 1,000 కాగా గరిష్ట పరిమితి ఒక ఖాతాకు రూ. 9 ల‌క్ష‌లు, జాయింట్ అకౌంట్‌కు రూ. 15 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించారు. ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు ఉండవచ్చు.

ఉదాహరణకు.. ఇద్ద‌రు దంపతులు రూ. 10 లక్షలు ఉమ్మడి ఖాతాలో డిపాజిట్ చేస్తే, వారికి ప్రతి నెలా సుమారు రూ. 6,167 వడ్డీ వస్తుంది. గరిష్ట పరిమితి రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే, నెలకు సుమారు రూ. 9,250 వరకూ ఆదాయం పొందవచ్చు.

35
మెచ్యూరిటీ స‌మ‌యం

ఈ పథకానికి మెచ్యూరిటీ పీరియ‌డ్ ఐదు సంవత్సరాలు. అంటే, ఐదు సంవత్సరాల తరువాత మొత్తం డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. వడ్డీ ప్రతి నెలా నేరుగా పెట్టుబడిదారుడి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఐదు సంవత్సరాల గడువు పూర్తయిన తర్వాత, మీరు అదే మొత్తాన్ని తిరిగి కొత్త MIS ఖాతాలో పెట్టుబడి చేయవచ్చు.

45
ఈ ప‌థ‌కం ఎవ‌రి కోసం అంటే.?

ఈ పథకం ప్రధానంగా రిస్క్ తీసుకోలేని పెట్టుబడిదారుల కోసం అనుకూలంగా ఉంటుంది. పదవీ విరమణ చేసినవారు, స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉప‌యోగ‌ప‌డుతుంది. నిరంత‌ర వ‌డ్డీ ఆదాయం కోరుకునే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. మార్కెట్‌పై ఆధారపడే మ్యూచువల్ ఫండ్‌లు లేదా షేర్లతో పోలిస్తే, MISలో పెట్టుబడి స్థిరమైన, హామీ ఉన్న రాబడిని అందిస్తుంది.

55
పెట్టుబడి ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు

* మీరు ఈ పథకంలో చేరాలంటే ముందుగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఉండాలి.

* ఈ పథకం నుంచి ముందుగానే డబ్బు తీసుకోవాలంటే, కొన్ని పెనాల్టీ షరతులు వర్తిస్తాయి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన వివ‌రాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఏదైనా ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టే ముందు ఆర్థిక స‌ల‌హాదారుడి సూచ‌న‌లు పాటించ‌డం ఉత్త‌మం.

Read more Photos on
click me!

Recommended Stories