తయారీ విధానం:
కర్పూర పొడిని యంత్రంలో ఉంచి టాబ్లెట్లు తయారు చేస్తారు. ఇందుకు యంత్రం సరిగా అమర్చడం, విద్యుత్ కనెక్షన్ జాగ్రత్తగా ఇవ్వడం అవసరం. మొదట చిన్న పరిమాణంలో ఉత్పత్తి ప్రారంభిస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది.
రసాయన ఫార్ములా:
కర్పూర రసాయన సమ్మేళనం C10H16O (కార్బన్, ఆక్సిజన్, హైడ్రజన్) ఆధారంగా ఉంటుంది.
ప్యాకింగ్:
కర్పూరం ఆల్కహాల్‌లో కరిగిపోతుంది కాబట్టి ప్యాకింగ్ సురక్షితంగా ఉండాలిఒక ప్యాకెట్‌లో 50 కంటే ఎక్కువ టాబ్లెట్లు ఉండొచ్చు. ప్యాకెట్‌పై ధర, పరిమాణం ముద్రించాలి.
మార్కెట్, అమ్మకాలు, లాభం
ఎక్కడ అమ్మాలి:
* పూజా సామాగ్రి దుకాణాలు
* మందుల దుకాణాలు, ఆయుర్వేద సెంటర్లు
* గ్రాసరీ షాపులు, బ్యూటీ షాపులు
* టెంపుల్ స్టోర్లు, హెల్త్ స్పాస్
* అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా విక్రయిస్తున్నారు. ఇక లాభాల విషయానికొస్తే మీరు చేసే మార్కెటింగ్‌పై మీ లాభాలు ఆధారపడి ఉంటాయి. మీ సొంత బ్రాండింగ్‌తో విక్రయిస్తే కనీసం నెలకు రూ. 30 వేల ఆదాయం పొందొచ్చు.