Credit Card: ఎంత చేసినా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెర‌గ‌డం లేదా.? ఈ టిప్స్ మీ కోస‌మే

Published : Oct 20, 2025, 04:47 PM IST

Credit Card: క్రెడిట్ కార్డు లిమిట్ పెర‌గాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. అయితే క్రెడిట్ లిమిట్ పెంచాలంటే బ్యాంకులు కొన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. అవేంటంటే.. 

PREV
15
లిమిట్ ఎందుకు పెంచుకోవాలి.?

క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడితే క్రెడిట్ యూటిలైజేషన్ రేటు పెరిగి CIBIL స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంది. సాధారణంగా మొత్తం లిమిట్‌లో 30 శాతానికి లోపు వాడితే స్కోర్ మెరుగ్గా ఉంటుంది. క్ర‌మంగా క్రెడిట్ కార్డును ఉప‌యోగిస్తూ రీపేమెంట్ చేస్తే లిమిట్ పెరుగుతుంది.

25
బిల్లులు సంపూర్ణంగా సకాలంలో చెల్లించండి.

క్రెడిట్ చెల్లింపులు ఎప్పటికీ స్కిప్ చేయద్దు. చిన్న రుణాలను కూడా సమయానికి తీర్చండి. మినిమం బిల్లు చెల్లించి ఆపేస్తే సిబిల్ పై ప్ర‌భావం ప‌డుతుంది.

35
క్రెడిట్ యూటిలైజేషన్‌ను తగ్గించండి

సింగిల్ కార్డ్ మాత్రమే కాకుండా మీ అన్ని కార్డుల మొత్తం లిమిట్‌ను బట్టి యుటిలైజేషన్ చూస్తారు. ఈ రేషియో 30% కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు మీకు మొత్తం లిమిట్ రూ. 1,00,000 ఉంటే వాడ‌కం రూ. 30,000 కిందే ఉంచాలి.

45
ఆదాయం పెరగినట్లయితే సమాచారం ఇవ్వండి

మీ ఆదాయం పెరిగినప్పుడు మీరు మీ బ్యాంక్‌కు వివ‌రాలు అందించ‌వ‌చ్చు. జీతం పెంపు, సైడ్జాబ్, ఫ్రీలాన్స్ ఆదాయం వంటి కొత్త ఆదాయ ఆధారాలను చూపించి లిమిట్ పెంచమని రిక్వెస్ట్ చేసుకోవ‌చ్చు. శాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్, ఫార్మ్‌ 16 వంటివి సమర్పించండి.

55
రీపెమెంట్ రికార్డ్

బ్యాంకులు సాధారణంగా కొన్ని నెలలకు సంబంధించిన రీపేమెంట్ రికార్డ్ చూస్తాయి. ఒకటి-రెండు సంవత్సరాల సక్రమ చెల్లింపుల తరువాత లిమిట్ పెంపు కోరితే ఆమోదం రావటం సులభం. అలాగే మీ ప్ర‌స్తుతం యుటిలైజేష‌న్ త‌క్కువ‌గా ఉంటే ఆటో ఇంక్రీజ్ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ లేదా సేఫ్ డిపాజిట్ లైన్స్ ఉంటే బ్యాంక్‌కు చూపించి ప్రత్యేక లిమిట్ పొందవచ్చు.

ఈ అంశాలు కూడా

బ్యాంకులు మీ క్రెడిట్ హిస్టరీ, ఆదాయం స్థిరత్వం, ఖర్చు శైలీ, EMIs స్థాయిని పరిశీలిస్తాయి. ఈ అంశాలు బలంగా ఉంటే లిమిట్ పెరగడం సహజం.

Read more Photos on
click me!

Recommended Stories